Teacher Professional Code

Teacher Professional Code

ఉపాధ్యాయ వృత్తి నియమావళి:

ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల గౌరవ భావము మరియు అంకిత భావము కలుగజేయుటకు ఉపాధ్యాయ వృత్తి నియమావళి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి నియమావళి ముఖ్య ఉద్దేశంతో కూడినది గా ఉంటుంది. 

 

విద్యార్థులు పట్ల నియమావళి:

ఉపాధ్యాయుడు తన విద్యార్థులు అందరినీ ప్రేమ మరియు వాత్సల్యం ప్రదర్శన చేయాలి. విద్యార్థులు అందరి పట్ల వారి కుల, మత, లింగ, ఆర్థిక స్థాయి, అంగ వైకల్యం, భాష మరియు జన్మ ప్రదేశాలు సంబంధం లేకుండా న్యాయంగా నిష్పక్షపాతముగా ఉండడం. విద్యార్థులు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, సాంఘిక, శరీరక, మేధోపర, నైతిక మరియు ఉద్వేగ అభివృద్ధికి తోడ్పడు మరియు మెరుగైన పరిస్థితి కలగజేయడం. పాఠశాలలో అన్ని కృత్యాలులో విద్యార్థి యొక్క అభిమతం గౌరవించాలి. విద్యార్థులు తమ కున్న ప్రతిభ మరియు శక్తి సామర్థ్యాలు పెంపొందించు కొనుటకు సరైన పథక రచన ఉపాధ్యాయులు చేయగలగాలి.     

 

తల్లిదండ్రుల మరియు సంఘము
పట్ల ప్రవర్తన నియమావళి:

ఉపాధ్యాయుడు విద్యార్థులు అభివృద్ధి కి వారి తల్లిదండ్రులు మరియు సంరక్షకులుతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. వారి గౌరవ మర్యాదలుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రవర్తన ఉండాలి. విద్యార్థులు యందు దేశము ముందు, వ్యక్తి తర్వాత అను భావం పెంపొందే విధంగా ఉపాధ్యాయుడు కృషి చేయాలి. వివిధ మతాలు, కులాలు, తరగతుల మధ్య విభేదాలు కలగకుండా, విభేదాలు రూపుమాపుటకు ప్రయత్నాలు చేయుట.     

 

ఉపాధ్యాయ వృత్తి మరియు
తోటి ఉద్యోగులు పట్ల నియమావళి:

ఉపాధ్యాయుడు నిరంతరము వృత్తి నైపుణ్యాలు పెంపొందించు కోవాలి. తోటి ఉద్యోగులు మరియు భాగస్వాముల పట్ల సహకారము మరియు సమన్వయం పెంపొందించుటకు ప్రయత్నాలు చేయాలి. ఉపాధ్యాయ వృత్తి పట్ల గర్వపడి సాటి ఉపాధ్యాయులను గౌరవంగా మర్యాదగా చూసుకొనుట. ప్రయివేటు పాఠశాలల్లో పాఠాలకు దూరంగా ఉండుట. వృత్తి పరంగా చేపట్టు కార్యక్రమాలు యందు ఇతరుల వద్ద నుండి బహుమతులు స్వీకరించకుండా ఉండుట. ఇతర ఉద్యోగులు, అధికారులు పై ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఉండుట. అగౌరవ వాక్యలు చేయకుండా ఉండుట. సహచర ఉద్యోగులు వాదనలు మరియు అభిప్రాయాలను గౌరవించాలి. సహచర ఉద్యోగులు సమాచారాన్ని గోప్యంగా ఉంచి అవసరమైన సమయంలో మాత్రమే వెల్లడి చేయుట.      

 

Teacher Professional Code:

భారత రాజ్యాంగంలోని పొందపర్చబడిన విలువలు ఆధారంగా విద్యా ప్రణాళికను నిర్వహించడం. విద్యార్థులు వైయుక్తిక బేధాలు అనుగుణంగా బోధన మరియు అభ్యసన పక్రియ మలచుట. విద్యార్థులు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలి. అవసరమైన మేరకు ఇతరులకు అందించుట. విద్యార్థులును ఎటువంటి భయబ్రాంతులుకు గురి చేయకుండుట. శరీరక దండన, మానసిక క్షోభ పెట్టకుండా మరియు బాలికల పట్ల లైంగిక వేధింపులకు గురిచేయకుండా వారిని కాపాడుట. విద్యార్థులు మరియు తన తోటి ఉపాధ్యాయులు, ఎదుటి వ్యక్తులను యందు కూడా ఒక ఆదర్శ మూర్తిని చూసుకునే విధంగా ప్రవర్తన చేయుట.

ఈ విధానాన్ని పాటిస్తూ ఉపాధ్యాయ వృత్తికి శోభ చేకూర్చే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రవర్తన నియమావళి పాటిస్తూ, మార్పులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలి.

Related posts