Home based Assignment

Home based Assignment

 

పిల్లలకు నియోజనం ఇచ్చుటలో తీసుకోవలసిన జాగ్రత్తలు Home based Assignment 

తరగతి గదిలో ఏదైన ఒక పాఠ్యాంశం బోధించిన తరువాత ఆ బోధనాంశం విద్యార్థి ఎంతవరకు, ఏ మేరకు నేర్చుకొన్నాడో, మరియు పూర్తిగా అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకొనుటకు విద్యార్థి కి పునర్బలనము, స్వీయ అభ్యసనం కోసం నియోజనం అవసరం.

పిల్లలు నియోజనం ఇచ్చుటలో పాటించవలసిన నియమాలు:

1. విద్యార్థికి నేర్పిన పాఠ్యాంశాలకు లేదా భోధనాంశంకు అనుగుణంగా నియోజనం ఉండాలి.

2. నియోజనం పరిధి ఎక్కువగా ఉండకూడదు.

3. పిల్లవాడు స్వయంగా పూర్తి చేసే విధంగా నియోజనం ఉండాలి.

4. పిల్లలకు సందేహాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు.

5. విద్యార్థి వయస్సు బట్టి, ఆసక్తిని బట్టి, తెలివితేటలను బట్టి, ప్రతి నియోజనానికి ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని నిర్ణయించి నియోజనాన్ని కేటాయింపు చేయాలి.

6. నియోజనం వ్యక్తిగతంగా కూడా కల్పించవచ్చు.

7. ప్రస్తుతం బోధిస్తున్న అంశానికి సంబంధించి నియోజనం ఉంటుంది.

8. నియోజనం అంటే విద్యార్థి తాను చేయవలసింది లేదా తాను గమనించి, ప్రత్యక్ష పరిశీలించి, తెలుసుకొని, ఉపాధ్యాయుని సూచనలు ప్రకారం నియోజనం నిర్వహించవలసి ఉంటుంది.

9. స్వతంత్రంగా ఆలోచించి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశమిస్తూ ఆత్మవిమర్శన చేసుకుంటూ విద్యార్థి అభివృద్ధి పొందుటకు వీలుగా నియోజనం ఉపాధ్యాయుడు తయారుచేయాలి.

10. సాధ్యమైనంత వరకు ప్రతి విద్యార్థి లోనూ కుతూహలాన్ని ప్రేరేపించే మరియు ఆసక్తి కలిగించే సహజ నియోజనాలు తయారు చేయడానికి ఉపాధ్యాయుడు కృషి చేయాలి.

11. తరగతి గదిలో గానీ, ఇంటి దగ్గర గానీ నియోజనం నిర్వహించవచ్చు.

12. వ్యక్తిగతంగా మరియు జట్టులో విద్యార్థులను విడగొట్టి నియోజనం పూర్తి చేయమని ఇవ్వాలి.

13. జట్టులో నియోజనం కల్పించి నప్పుడు కూడా అందరి విద్యార్దులను వ్యక్తిగత పరిశీలన చేయవలసి ఉంటుంది.

14. ప్రతి విద్యార్థి నియోజనాలు జయప్రదంగా చేయడాన్ని బట్టి, కొత్త విషయాలు స్వయంగా తెలుసుకొని మదింపు చేసుకుంటూ ముందుకు వెళ్తాడు.

15. విద్యార్థి నియోజనాలు ఆధారంగా నూతన భోధనాంశం ఉపాధ్యాయులు తయారుచేయాలి.

నియోజనం ఒక వారం లేదా రోజులో పూర్తి చేసే విధంగా కూడా ఉంటుంది. నియోజనం కల్పించే సమయంలో ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర విద్యార్థి ఏమి చేయాలో తెలిపే విధంగా ఒక సూచన పత్రం ఇవ్వాలి. సూచన పత్రం విద్యార్థి ఏం చేయాలి, ఏం చదవాలో, ఏ ఏ పుస్తకాలు చదవాలో వివరిస్తుంది. దీని ప్రకారం సేకరించిన విషయాలు నోటు పుస్తకంలో నమోదు చేయాలి. వీటిని పరిశీలించి ఉపాధ్యాయుడు లోపాలు ఉంటే సరిచేసి సమాధానాలు సంతృప్తిగా ఉన్నాయి అనుకుంటే తరువాత నియోజనం కి అనుమతి ఇవ్వాలి.

మొక్కలు పెరుగుదలకు సారవంతమైన నేల అవసరమా?

అనే అంశం పరిశీలించి నియోజనం తయారుచేయు విధానం.

మొదటి జట్టు:
ఒక కుండీ తీసుకుని దాన్ని మామూలు మట్టి నింపి ఆరోగ్యవంత మొక్క నాటుతారు.

రెండో జట్టు:
వేరొక కుండీ తీసుకుని దాన్ని సారవంతమైన మట్టి నింపి ఆరోగ్యవంత మొక్క నాటుతారు.

రెండు కుండీ మొక్కలును నీళ్ళు పోసి సూర్య కాంతి సమక్షంలో ఒక వారం పరిశీలనలో ఉంచాలి.

విద్యార్దులు మొక్కలు పెరుగుదలకు కాంతి, నీరుతో పాటు సారవంతమైన నేల కూడా ముఖ్యమైనది అని స్వయంగా నియోజనం ద్వారా తెలుసుకుంటార.

 

తరగతిలో పాఠ్యాంశము బోధించిన తరువాత ఆ బోధనాంశము మీద విద్యార్థి ఏమేరకు అవగాహన చేసుకున్నాడో తెలుసుకొనుటకు విద్యార్థి పునర్బలనము, స్వీయ అభ్యసనానికి అసైన్‌మెంట్ (Home Assignment) అవసరం.

 

Related posts