Teaching
Learning Material
తరగతి గదిలో బోధన మరియు అభ్యసన పక్రియ రెండూ పలప్రదం కావడానికి ఉపయోగించే సామాగ్రిని బోదనభ్యసన సామాగ్రి Teaching Learning Material అంటారు.
బోదనభ్యసన సామాగ్రి ఆవశ్యకత:
పిల్లలు బడి పట్ల ఆశక్తి కలిగించి ఆకర్షితులనూ చేస్తుంది.
విద్యార్థులు ఆసక్తిగా, ఉత్సాహంతో బోధన పక్రియలో పాల్గొంటారు.
విద్యార్థులు సహజ వాతావరణంలో నేర్చుకొనుటకు.
బహుళ తరగతుల బోధన సులభతరం చేయుటకు.
బోదనభ్యసన పక్రియ వేగవంతం చేయుటకు.
అమార్త భావాలను మూర్త రూపంలో అవగాహన చేసుకొని భావనలు స్వీకరించుటకు.
గణితం వంటి క్లిష్టమైన భావనలు విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకొనుటకు.
బోదనభ్యసన సామాగ్రి స్వరూప
స్వభావం:
బోదనభ్యసన సామాగ్రి విషయమై SCT – 2017 కూడా స్థానికంగా లభించే బోదనభ్యసన సామాగ్రి వినియోగించాలి సూచించింది. అంతే కాకుండా TV, రేడియో, కంప్యూటర్లు, గ్రంథాలయం, ప్రయోగశాల వంటి వనరులు అందుబాటులో తెచ్చి బోదనభ్యసన ఫలప్రదంగా, అర్ధవంతంగా జరగాలని సూచించింది.
TLM తయారుచేయడం:
తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా తయారు చేయబడి అందంగా, ఆకర్షణగా, బోధన పట్ల ఆశక్తి పెంపొందించేలా ఉండాలి. పిల్లలు స్థాయికి, వయస్సుకి తగినదై ఉండాలి. విద్యార్థులు పలు రకాల భావాలను, ఆలోచనలును పెంపొందే విధంగా ఉండాలి. పిల్లలు సామాగ్రికి ఆకర్షితులు అవ్వాలి. స్వేచ్ఛగా పిల్లలు అందరూ పాల్గొని చర్చించుకొనేలా ఉండాలి. వ్యక్తిగతంగా మరియు జట్టుగా పూర్తి తరగతి కృత్యాలుకు అనువుగా ఉండాలి. ఒకే బోదనభ్యసన సామాగ్రి వేరు వేరు భావనలను పెంపొందే విధంగా ఉండాలి. ప్రత్యక్ష అనుభవాలు కలిగించేలా ఉండాలి. పరిమితికి మించి బోదనభ్యసన సామాగ్రి ఉపయోగించకూడదు. భావనలు అవగాహన యందు స్పష్టత కొరకు బోదనభ్యసన సామాగ్రి వాడి అమార్తత్వతానికి దారి తీసేవిధంగా ఉండాలి.
పాఠశాలలో ఉపయోగించే
నమూనా బోదనభ్యసన సామాగ్రి:
1. రేఖా చిత్రాలు
2. ఛాయా చిత్రాలు
3. ఫ్లాష్ కార్డు
4. ఫోస్టర్
5. చార్టుల
6. బొమ్మలు
7. గ్రాఫ్
8. మాప్లు
9. కార్టూన్
10. హస్య పత్రిక
11. ప్రదర్శన బల్లలు
12. నల్ల బోర్డు
13. తెల్ల బోర్డు
14. ప్యానల్ బోర్డు
15. బులిటిన్ బోర్డు
16. మాగ్నెట్ బోర్డు
17. పెగ్ బోర్డు
18. రోలింగ్ బోర్డు
19. త్రిమితిక సాధనాలు
20. మాదిరి నమూనా
21. వస్తువులు
22. మచ్చు
23. డయోరమా
24. కదిలే బొమ్మలు
25. తోలు బొమ్మలు
26. పరికరాలు
27. మైక్రో స్కోప్
28. ప్రయోగశాల సామాగ్రి
29. వర్క్ పుస్తకాలు
30. సమాచార పత్రిక
31. కర పత్రాలు
32. చలన చిత్రాలు
33. చిత్ర ఖండాలు
34. స్లైడ్
35. రేడియో
36. టి. వి
37. టెలీ కాన్ఫరెన్స్
38. ఓవర్ హెడ్ ప్రొడక్ట్
39. ఏపిడియో స్కోప్
40. బ్లేడ్
41. కప్పీలు
42. పట్ట కారు
43. హెక్ సా
44. బర్నర్
45. కాగితాలు
ఇటువంటి అనేక విధమైన ప్రయోగశాల సామాగ్రి TLM గా ఉపాధ్యాయుడు ఉపయోగించాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశానికి తగిన బోదనభ్యసన సామాగ్రి సొంతంగా సమకూర్చుకొని పాఠ్యప్రణాళిక ఆధారంగా బోధన లో ఉపయోగించాలి. TLM ఎప్పుడూ నిత్య నూతనంగా ఆకర్షణగా తక్కువ ఖర్చుతో కూడినది తయారుచేయాలి. పరిసరాల నుండి ఎక్కువ సామాగ్రి సమకూర్చుకొని ఉపయోగించాలి. TLM తయారీ లో విద్యార్థులు సహకారం తీసుకోవాలి. Teaching Learning Material వినియోగం తరువాత జాగ్రత్తగా వాటిని భద్రత కల్పించి అవసరమైన సమయంలో విద్యార్థులు ఉపయోగించే విధంగా అవకాశాలు కల్పించాలి.