PART 2 Nomination Details

E-SR Part-1 Family Details నందు కుటుంబ సభ్యులు పేర్లు ఏవైతే Enter చేశారో అవే పేర్లు PART 2 Nomination Details నందు Display  అవుతాయి. CPS, APGLI Bond నందు వేరే పేరుతో Nominee ఉంటే ఆ పేరు Part -1 Family Details నందు ముందు Enter చేసి Save చేయండి.

E-SR నందు Nominee Other option  పనిచేయడం లేదు. కాబట్టి ఈ భాగంలో Enter చేసే Nominee పేరు Family Details నందు కూడా Enter చేయాలి. Computer నందు ఈ other option పని చేస్తుంది. Mobile నందు వీలుకాదు. 

 

Nominee:  సాధారణంగా Employee Married ఐతే భర్త / భార్య వారి పిల్లలు Nominee గా ఉంటారు. Unmarried ఐతే అతడు/ఆమె తల్లిదండ్రులు Nominee గా ఉంటారు. వీరు జీవించి లేని పక్షంలో ఇతర కుటుంబ సభ్యులు Nominee గా అవకాశం ఉంటుంది.

CPS, APGLI యొక్క Nominee వివరాలు ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు. E-SR Submit తరువాత Nomination Details Edit option లేకుంటే భవిష్యత్ లో ఇబ్బంది కలుగకుండా ఇప్పుడే సరియైన Nominee Enter చేయాలి.

 

Nominations

।.Gratuity:

 

1.Name of the Family Members and Relationship

2. Date of Nomination

Gratuity అనేది Service years బట్టి లెక్కింపు ఉంటుంది. కాబట్టి మీ First Appointment Date లేదా Joining Date నూ Date of Nomination గా Enter చేయాలి. Family Details లో Date of Birth Enter చేశాము కాబట్టి ఇక్కడ Date of Nomination Enter చేయాలి.

3. % Share to be paid for each nominee

Nominee members బట్టి % ఇవ్వండి.

Total Percentage : Display 100

Add Row ద్వారా మరో Nominee Enter చేయవచ్చు.

 

।।. Original or alternative nominee for GPF:

 

1. Name of the Family Members and Relationship

2. Date of Nomination

మీ మొదటి PF Cutting ప్రారంభ తేదీని Enter చేయండి.

3. % Share to be paid for each nominee

PF లో ఉన్న Nominee members బట్టి % ఇవ్వండి.

Total Percentage : Display 100

 

।।।. Original or alternative nominee for NPS:

 

1. Name of the Family Members and Relationship

2. Date of Nomination

మీ NPS Account Activation Date Enter చేయండి. సుమారు ఈ Date నుండి Contribution cutting ఉంటుంది. దీని కొరకు మీ NPS Account Login అవ్వండి.

3. % Share to be paid for each nominee

NPS Account లో ఉన్న Nominee members బట్టి % ఇవ్వండి.

Total Percentage : Display 100

 

IV. Nominees for APGLI:

 

1. Name of the Family Members and Relationship

2. Date of Nomination

మీ APGLI మొదటి A Bond లో బీమా ప్రారంభ తేదీని Enter చేయండి. సుమారు ఈ Date నుండి Premium cutting ఉంటుంది.

3. % Share to be paid for each nominee

Bond లో ఉన్న Nominee members బట్టి % ఇవ్వండి.

Total Percentage : Display 100

E-SR అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత Save చేయండి. మీరు మరల ఎప్పుడైనా Edit చేసుకునే అవకాశం ఉంది.

 

https://apesr.apcfss.in/Login.do

 

PART 2 Nomination Details totally completed. 

 

 

 

Related posts

One Thought to “PART 2 Nomination Details”

  1. […] PART-3 Service Events Appointment Probation Regularization Completed. […]

Leave a Comment