DIKSHA – NISHTHA Modules Qustions&Answers
Module -12
AP Pedagogy of Science
DIKSHA – NISHTHA Modules
మాడ్యూల్ – 12
విజ్ఞానశాస్త్రము – భోధన
పోర్ట్ ఫోలియో కృత్యం
అంశం: భౌతిక – రసాయన మార్పులు
తరగతి: 7th
పాఠ్యాంశ వివరణ:
విద్యార్ధులుకు వివిధ పదార్థాలు లో జరిగే భౌతిక – రసాయన మార్పులును అవగాహన చేయుట.
భౌతిక మార్పులు:
మన చుట్టూ జరిగే మార్పులు గమనిస్తూ ఉంటే ఉదా: మంచు గడ్డ కరగడం, కొబ్బరి నూనె శీతాకాలంలో గడ్డకట్టడం మొదలైన వాటిలో ఆయా పదార్థాలు లో మార్పు చూడవచ్చు. పై వాటిలో పదార్థం యొక్క రంగు, స్థితి, పరిమాణం, ఆకారంలో మాత్రమే మార్పు జరిగింది. పదార్థం యథాతథంగా ఉంది. కొత్త పదార్థం ఏర్పడలేదు. సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. ఇటువంటి మార్పులును భౌతిక మార్పులు అంటారు.
రసాయన మార్పులు:
ఒక కర్ర ముక్క, కాగితం ముక్కు కాల్చి నప్పుడు ఏర్పడిన పదార్థం బూడిదగా, నలుపు రంగులో ఉంటుంది. పై వాటిలో పదార్థం యొక్క రంగు, స్థితి, పరిమాణం, ఆకారంలో మార్పు జరిగింది. అంతే కాకుండా కాల్చక ముందున్న పదార్థాలుకు భిన్నంగా ఉన్న కొత్త పదార్థం ఏర్పడింది. పదార్థం యొక్క రంగు, స్థితి, పరిమాణం, ఆకారంలో మార్పులే కాకుండా కొత్త పదార్థాలు ఏర్పరిచే మార్పులను రసాయన మార్పులు అంటారు. పదార్థాలు యొక్క సంఘాటనంలో మార్పు జరుగుతుంది. ఇటువంటి రసాయన మార్పును రసాయన చర్య అంటారు.
అభ్యసన ఫలితాలు :
1. నిత్యజీవితంలో జరిగే భౌతిక-రసాయన మార్పులను అవగాహన చేసుకోగలరు.
2. రసాయన మార్పులు గమనించి పరికల్పన చేయగలరు.
3. క్షేత్ర పరిశీలనలో పాల్గొని ప్రయోగాలు చేయగలరు. నివేదికలు తయారుచేయగలరు.
4. భౌతిక-రసాయన మార్పులను విశ్లేషణ చేయగలరు. ప్రాజెక్టు పనులు చేయగలరు.
5. భౌతిక, రసాయన చర్యలు యొక్క నమానాలు తయారు చేయగలరు.
6. ప్రకృతిలో జరిగే చర్యలను విద్యార్ధులు అభినందించగలరు.
7. భౌతిక, రసాయన చర్యలను నిత్యజీవితంలో ఉపయోగించగలరు.
వనరులు:
క్షేత్ర పర్యటనలు, తరగతి గది ప్రయోగశాల.
అభ్యసన అనుభవాలు:
ప్రయోగశాల పద్ధతి: విజ్ఞానశాస్త్ర భోధనకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రయోగ నిర్వహణ కోసం వ్యక్తిగత సామూహిక కృత్యాలు కల్పించుట.
ఉద్ధేశం:
రసాయనిక చర్యలు పరిశీలించడం.
పరికరాలు-పదార్ధాలు:
గాజు బీకరు, మేకు, కాపర్ సల్ఫేట్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నీరు.
పద్ధతి:
ఒక గాజు బీకరు నీటిలో ఒక స్పూన్ కాపర్ సల్ఫేట్, కొద్దిగా సల్ఫ్యూరిక్ ఆమ్లం కలపండి. ఈ ద్రావణం నుంచి కొద్ది ద్రావణం మరొక బీకరులో తీసుకోండి. ఒక బీకరులో ఇనప మేకును కదిలించకుండా కొద్ది సేపు ఉంచండి.
పరిశీలన:
కొద్ది సేపటి తరువాత రెండు బీకరులో ద్రావణం రంగులు పరిశీలించండి.
బీకరు నుంచి ఇనప మేకును బయటకి తీసి పరిశీలించండి.
ఫలితం:
మొదటి బీకరు నీరు నీలిరంగు ద్రావణంగా మారింది.
రెండవ బీకరు ద్రావణం నీలిరంగు నుండి ఆకుపచ్చ రంగు ద్రావణంగా మారింది.
ఇనప మేకు పై గోదుమ రంగు పొర ఏర్పడింది.
కాపర్ సల్ఫేట్ + ఇనుము ➡ ఐరన్ సల్ఫేట్ + కాపర్
సాధించవలసిన అభ్యసన ఫలితాలు:
1. నిజజీవితంలో జరిగే భౌతిక-రసాయన మార్పులు గమనిస్తాడు.
ఉదా: కొబ్బరి నూనె గడ్డకట్టడం, ఇనుము తుప్పు పట్టడం.
2. విషయాలు, పక్రియలకు మధ్య గల సంబంధాలను సరియైన కారణాలతో వివరిస్తాడు.
ఉదా: టపాకాయలు కాల్చినప్పుడు జరిగేది రసాయన చర్యలు అని, బూడిద, వెలుతురు రసాయన చర్యలు వలన ఏర్పడేవి అని వివరిస్తాడు.
Download copy Adobe లో open చేసి Name edit చేసుకోండి.
Send module 1Quiz answer
Excellent
Super
Sorry for the delay
Send module 6 portfolio
Quiz 11,12 answers plz
Please check all sir
https://master.army/2020/10/23/modules-qustionsanswers-10-10-marks/