Module – 4 Integrating Gender in Teaching Learning Process Portfolio
మాడ్యూల్-4
భోధన – అభ్యుసన పక్రియలో లింగభావనను సమగ్రపరచడం
పోర్టుఫోలియో కార్యాచరణ అంశాలు
1. విజువల్స్:
బాలబాలికలు అసమానతలు లేకుండా పాల్గొన్న కార్యక్రమాల ఫోటోలు, వీడియో దృశ్యాలు పాఠశాల నందు ప్రదర్శనలు చేయడం.
2. విషయము:
లింగ సమానత్వం సమగ్రపర్చడం.
బాలబాలికల మధ్య అసమానతలు సమాజంలో ఏర్పడకుండా చేయడం. భోధనలో లింగభావన, మూసధోరణి లేకుండా తగిన చర్యలు చేపట్టడం.
3. భోధన – అభ్యాస పక్రియ:
లింగ భావన అసమానతలు లేకుండా బాలికలు మరియు బాలురుకు ఒకే విధమైన కృత్యాలు, సమాన అవకాశాలు కల్పించడం. అభ్యుసన అనుభవాలు కల్పించడంలో ఎటువంటి వివక్షత లేకుండా చేయడం. భోధనలో బాలికలు కూడా ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించాలి. క్లిష్టమైన భావనలు కూడా బాలికలు అవగాహన చేసుకోని, వాటిని పరిష్కరించగలరు అని నిరూపణ చేయడం. బాలురు బాలికల మధ్య చర్చలు జరిగేటట్టు చూడడం. భయంలేని, ఒత్తిడి లేని స్థితి బాలికల్లో ఉండే విధంగా అవకాశాలు కల్పించడం. బాలురు మరియు బాలికల మధ్య సమస్యలు పరిష్కరించడం. బాలబాలికలుకు భోధన అభ్యుసన పక్రియలో భాగంగా క్విజ్, జట్టు కృత్యాలు నిర్వహించడం. బాలబాలికలును జట్టు కృత్యాలు కల్పించడం. ప్రతి జట్టుకి బాలబాలికలును లీడర్స్ గా ఎన్నుకోవడం. జట్టులో బాలికల సహకారం ప్రోత్సాహించడం. జట్టు సభ్యులు మధ్య ఎటువంటి వివక్షత లేకుండా చూడడం. జట్టు సభ్యులు సంభాషణలు పరిశీలించి అసమానతలు లేకుండా చూడడం. కృత్యాల్లో పాల్గొన్న బాలికల ఆసక్తి, ఉత్సుకత, ఆలోచనలు పెంపొందించే విధంగా జట్టు వాతావరణం కల్పించడం. భయంలేని, ఒత్తిడి లేని స్థితి బాలికల్లో ఉండే విధంగా అవకాశాలు కల్పించడం. జట్టు నాయకురాలు పాత్రను ప్రశంసించడం. బాలురుతో సమానంగా నాయకత్వ లక్షణాలు బాలికలు ఏవిధంగా నిర్వహించారో తెలియపర్చడం. వివిధ ప్రాజెక్ట్ పనులు కల్పించడం. వివిధ రకాల చిత్రాలు, ప్లోచార్టుల ఆధారంగా బాలికలు వారి అభిప్రాయాలు వ్యక్తపరిచే విధంగా చేయడం. ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలకు సమాధానాలు బాలబాలికలు నుండి రాబట్టడం. బాలబాలికల మధ్య సంభాషణ రూపంలో చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరపడం.
4. అంతర్లీన పాఠ్యప్రణాళిక:
పాఠశాలలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. ఇందులో భాగంగా పాఠశాల అధికారిక కార్యక్రమాల్లో బాలికలను ప్రధాన భాధ్యత వహించే విధంగా చేయడం. జట్టులో సహకారాన్ని అందించడం. బాలికలు అందరూ కార్యక్రమాలు నిర్వహణలో పాల్గొనే విధంగా చేయడం. ప్రత్యక్ష అనుభవాలు కలిగించడం. బాలికలు చేస్తున్న పనులు ప్రశంసించడం. వివిధ కార్యక్రమాలు పాల్గొన్న బాలబాలికల పాత్రను ప్రశంసించడం. అన్ని అంశాలలో అందరికీ అవకాశాలు కల్పించడం. పాఠశాల, సమాజం మరియు తోటి వారిపై సానుకూల వైఖరి పెంపొందించే విధంగా బాలబాలికలుకు అవకాశాలు కల్పించడం. బాలికలు స్వేచ్చగా తిరగగలిగే వాతావరణం ఏర్పాటు చేయడం.
5. స్థానిక ఉదాహరణలు:
సమాజంలో ప్రధాన భాధ్యత తీసుకుని వృత్తి నిర్వహణ చేస్తున్న మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, రాజకీయ నాయకురాలు వంటి వారి పాత్రను గుర్తించే విధంగా చేయడం. పురుషులతో సమానంగా సమాజంలో వారు చేస్తున్న సేవలను కొనియాడాలి. స్థానిక పాఠశాల నందు విద్యా, క్రీడలు, నాయకత్వం వంటి యందు ప్రతిభను కనపరిచే బాలికలును ప్రసించడం.
Conclusion:
లింగ వివక్షపై గల మూసధోరణులు, వైఖరులును నిర్మూలించడం. కుటుంబంలో మరియు సమాజంలో లింగ వివక్షత లేని వాతావరణం సృష్టించడానికి మన వంతు భాద్యత నిర్వర్తించడం. తరగతి గదిలోనే కాకుండా పాఠశాల బయట కూడా లింగ వివక్ష లేకుండా భవిష్యత్ తరాన్ని తయారుచేయడం.
మనం Submit చేసిన Portfolios SRG లు మూల్యాంకనం చేస్తారు. Portfolios Write up, Videos, Slides వంటి ఏ రూపం ఉన్నను Submit చేయవచ్చు.
Module Portfolio Marks:
1. Submission – 1
2. Relevent Topic – 2
3. Evidence with Material – 3
4. Learning Experience – 2
5. Conclusion or Suggestions – 2
Total :10 marks