Module -5 Integration of ICT in Teaching Learning Assessment

Module -5 Integration of ICT in Teaching, Learning and Assessment

మాడ్యూలు – 5

బోధన, అభ్యసన మూల్యాంకనము లో ICT ని సమగ్రపరచడం.

 

 

పోర్ట్ పోలియో కృత్యం

 

సబ్జక్టు : గణితం

గ్రేడ్ : 5th

అధ్యాయము : సంఖ్యామానం

అంశం: 5 అంకెల వరకు గల సంఖ్యలు

 

ఆశించే అభ్యాసనా సామర్థ్యాలు :

సమస్యా సాధన, కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ

 

కీలక భావనలు :

ఐదంకెలు గల సంఖ్యలను అంచనా వేస్తారు.

ఐదంకెలు గల సంఖ్యలను ఒక క్రమంలో ఏర్పాటు చేయడం ఎలాగో తెలుసుకుంటారు.

ఇవ్వబడిన అంకెల నుండి సంఖ్యను తయారుచేయడం నేర్చుకుంటారు.

ఐదు అంకెలు గల సంఖ్యలకి సంబంధించిన అపోహలు తెలుసుకుంటారు.

 

పూర్వ జ్ఞానము :

నేర్చుకునే అంశం సంఖ్యామానం పై విద్యార్థి కొంత పూర్వజ్జ్ఞానం కలిగి ఉంటారు. ఐదు అంకెల సంఖ్యలు చదవడం, రాయడం, పెద్ద, చిన్న సంఖ్యలు గుర్తించ కలగడం, స్ధాన విలువలు చెప్పగలగడం వంటి అంశాలు వ్యక్తపరచగలడు.

 

ICT ని అనుసంధానించగల నూతన ఆలోచన :

విద్యార్థికి సంఖ్యామానంలో 5 అంకెల వరకు గల సంఖ్యలు అనే అంశంను “Diksha App” ఉపయోగించి నేర్చుకునే అవకాశం కల్పించాలి. ఇది ఒక అదనపు కృత్యంగా పాఠశాల లేదా ఇంటి వద్ద అందించాలి. అనుబంధ పాఠం పాఠ్యపుస్తకం పై ఉన్న QR code Scan చేయడం ద్వారా మరికొన్ని అదనపు అంశాలు విద్యార్థులు నేర్చుకుంటారు. కష్టమైన అంశాలను వివరించడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యలు పరిష్కార మార్గాలు విద్యార్థి సులభంగా కనుగొనగలడు. వీడియోస్, PDF రూపంలో Content download చేసుకొని Internet connection లేకపోయినప్పడికి నేర్చుకుంటారు. సొంత ఆలోచన ఏర్పడుతుంది. తనకు గల అపోహలు నివృత్తి చేసుకోగలడు.

 

 

ఉదాహరణకు:

ఐదు అంకెల గల సంఖ్యలకి సంబంధించిన అపోహలు

2, 3, 4, 5 మరియు 0 నుండి తయారుచేసిన అన్నిటికన్నా చిన్న ఐదు అంకెలు గల సంఖ్య ఏది?

1) 02345 ❌
2) 23450 ❌
3) 20345

0 సంఖ్యల ముందు చేర్చడం వలన సంఖ్య యొక్క విలువలో ఏ మార్పు ఉండదు.
సున్న విడిచి ఇది 4 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది సరికాదు అని తెలుసుకుంటారు.

0 నుండి సంఖ్యను ప్రారంభించకూడదు.
0 కన్నా చిన్న దైన శూన్యేతర సంఖ్య తరువాత రాయాలి అని అవగాహన చేసుకుంటాడు.

పై సమస్య పరిష్కార మార్గాలు విద్యార్థి Diksha App వీక్షణ ద్వారా సులభంగా మరియు అర్ధవంతంగా తెలుసుకొనగలడు.

 

మూల్యాంకనము గూర్చిన నూతన ఆలోచన :

ICT పరిజ్ఞానం విద్యార్థికి ప్రస్తుత పరిస్థితి లో అవసరం కాబట్టి మూల్యాంకనమునకు కూడా ICT ఒక సాధనంగా ఉపయోగించాలి. దీనికి గాను Quiz రూపంలో లేదా Google Forms ఉపయోగించి కూడా విద్యార్థి ఎంత వరకు అంశాలు గ్రహించాడో తెలుసుకొని మూల్యాంకనము చేయవచ్చు.

Conclusion :

మొబైల్ లెర్నింగ్ ను e – లెర్నింగ్ రూపంలో మార్చడానికి ICT ఉపయోగించాలి. ICT విద్యార్థి విద్య నేర్చుకోవడాన్ని ఇష్టపడేటట్లు చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన అభ్యాసకుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని TV, Radio మొదలైన సాధనాలు వినియోగించాలి. దృష్టి లోపం విద్యార్థికి తగిన విధంగా కూడా ICT అందించాలి.

 

Module -5 :

 

DOWNLOAD COPY 5 TEL

DOWNLOAD COPY 5 – ENG

 

 

 

Related posts

One Thought to “Module -5 Integration of ICT in Teaching Learning Assessment”

  1. […] మాడ్యూల్ – 6 అభ్యసనంలో కళలను అనుసంధానం చేయడం Module – 6 Art Integrated Learning. […]

Leave a Comment