Module – 6 Art Integrated Learning Nishtha Andhrapradesh

Module – 6 Art Integrated Learning

 

మాడ్యూల్ – 6 అభ్యసనంలో కళలను అనుసంధానం చేయడం Module – 6 Art Integrated Learning.

 

పోర్ట్ ఫోలియో

కళాసమ్మిళిత భోధనా కృత్యం

 

తరగతి: 5

విషయం: కళా అనుభవాన్ని సబ్జెక్టు తో అనుసంధానం చేయడం. తెలుగు భాష భోధనలో కళల అనుసంధానం.

అభ్యసన ఫలితాలు:

పద్యాలను రాగంతో చెప్పగలరు.

పద్య భావాలను సొంత మాటల్లో చెప్పగలరు.

పద్యాన్ని రాగయుక్తంగా, చక్కగా చెప్పగలగడం.

పద్యాన్ని, పద్యభావాన్ని సొంతంగా తప్పులు లేకుండా రాయగలరు.

పద్యభావానికి తగిన కథను రాయగలరు.

పద్యాన్ని చక్కగా కళను ఉపయోగించి అభినయం చేయగలరు.

 

కళా కృత్య రూపం:

కృత్య అను అభ్యసనకు “పద్యాల పోటీ” కళా రూపాన్ని ఎన్నుకొనుట.

 

సాధన పత్రం :

అభ్యాసకులు సమాహ కృత్యాలలో పాల్గొంటారు. కనుక కుల,మత,లింగ, వివక్షత లేకుండా వారి సామర్థ్యాలు అంచనా వేస్తూ, ప్రతి సమూహంలో కూడా అందరూ ఉండేటట్లు చూసుకోవాలి. ప్రదర్శన అనంతరం చర్చలు కు నాంది పలకాలి. విద్యార్థులు వారి వారి ప్రదర్శన రూపాలతో సిద్ధంగా ఉన్నప్పుడు అందరిముందు ప్రదర్శన చేయుటకు ఆహ్వానించవలెను. అంతర్లీనంగా ఉన్న ఇతర అంశాలను గుర్తించి వాటి మధ్య సమన్వయ పరచాలి. అదే సమయంలో మూల్యాంకనం కూడా జరగాలి.

 

కళ అనుభవాన్ని సబ్జెక్టు తో అనుసంధానం చేయడం:

ఉపాధ్యాయుడు తరగతి విద్యార్థులుకు శతక పద్యాలును కళ తో సమ్మిళితం చేయడం ద్వారా భోధన చేయుట. ఇందుకు పద్యాల పోటీ అను కృత్యం ఎన్నుకొనుట. విద్యార్థులు వారికి నచ్చిన, ఇష్టమైన పద్యాన్ని నేర్చుకోవడమే కాకుండా తరగతి స్టేజీ మీద రాగయుక్తంగా, చక్కగా చెప్పగలరు. అంతే కాకుండా పద్యాలుకు, తగిన అభినయం చేస్తూ ప్రదర్శన చేస్తారు. పద్యభావాన్ని చక్కగా వివరించగలరు. పద్య భావాలకు తగినట్లుగా సంభాషణలు రాసుకొని అభినయిస్తారు.

ఉదాహరణకు :

పద్యం :

మల్లెపూవుకంటే మంచి గంధముకంటె
పంచదారకంటె పాలకంటె
తెలుగుభాష లెస్స, దేశభాషలలో సం
గీత భాష తెలుగు జాతి భాష,

భావం:

మల్లె పూవు కంటె, మంచి గంధము కంటె ఇంపైనది తెలుగు భాష, పంచదార కంటె, పాల కంటె తీయనైనది తెలుగుభాష, దేశ భాషల్లో తెలుగు భాష గొప్పది. దేశ భాషల్లో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష.

పై పద్యాన్ని ఇద్దరు ముగ్గురు విద్యార్థులు జట్టుగా, సమూహంగా ఏర్పడి పద్యాన్ని రాగయుక్తంగా పాడుతారు. పద్యానికి తగిన అభినయం చేయగలరు. చక్కటి ప్రదర్శనలు ఇవ్వగలరు. ప్రదర్శనకు తగిన సామాగ్రి మల్లెపూలు, గంధం, పంచదార, పాలు, తెలుగు భాష ఫ్లకార్డు ప్రదర్శన చేసి అన్నింటి కంటే మాతృభాష తెలుగు గొప్పదని అభినయం చేస్తూ చక్కగా వివరించగలరు.

భాషల యందు కళలను మిళితం చేయడం చాలా సులభమైన విధానం. ఈ విధానం వలన పద్యభావాన్ని విద్యార్థులు పూర్తిగా అవగాహన చేసుకోగలరు. ఇతర విద్యార్థులు కూడా ఆనందంగా పద్యభావాన్ని అర్థం చేసుకోగలరు. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే తపన అందరి విద్యార్దుల యందు పెంపొందే విధంగా ఉపాధ్యాయుడు కృషి చేయాలి. ఉత్సాహంగా విద్యార్థి పాల్గొనే విధంగా ఉపాధ్యాయడు కృషి చేయాలి. అప్పుడే ఆనంధదాయకమైన పోటీ ప్రదర్శన జరుగుతుంది.

 

ముగింపు :

అభ్యాసకులు ఆనందిస్తారు. తోటివారి మరియు ఇతరుల చేసిన కళాకృత్యాన్ని అభినందిస్తారు. ప్రదర్శన అనంతరం చర్చలు జరపుతారు. సృజనాత్మకత అభివృద్ధి చెంది స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తోనూ తేలికగా సంభాషణలు జరపగలరు.

 

MODULE 6 PORTFOLIO

 

Related posts

One Thought to “Module – 6 Art Integrated Learning Nishtha Andhrapradesh”

  1. […] ఇది ఒక సారి జరిగేలా కాకుండా నిరంతర ప్రక్రియగా […]

Leave a Comment