AP- SCHOOL BASED ASSESSMENT Analysis Methods

AP- SCHOOL BASED ASSESSMENT

 

 AP – School Based Assessment   Analysis Methods

 

PORTFOLIO 

పాఠశాల ఆధారిత మదింపు

MODULE – 7

 

తరగతి : 7th

సబ్జెక్టు : గణితం

అధ్యాయము : భిన్నాలు

బోధనభ్యసన ప్రణాళిక : విశ్లేషణ పద్ధతి

ఒక సమస్యను చిన్న చిన్న అంశాలుగా విడదీయడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో బోధన వలన విద్యార్థికి సందేహాలు ఏర్పడవు. గణిత బోధనకు ఎక్కువగా ఉపాధ్యాయులు ఈ పద్ధతినే ఉపయోగిస్తుంటారు.

 

విశ్లేషణ విధానం :

ఉదా:

నలుగురు సభ్యులు గల కుటుంబంలో రోజుకు 15 చపాతీలు తింటారు. తల్లి 1/5 భాగం, 3/5 భాగం పిల్లలు మిగిలిన చపాతీలు తండ్రి తిన్నారు. అయిన

తల్లి తిన్న చపాతీలు ఎన్ని?
పిల్లలు తిన్న చపాతీలు ఎన్ని?
తండ్రి తిన్న చపాతీలు మొత్తంలో ఎంత భాగం?

 

ఉపాధ్యాయుడు:
సమస్యలో మనం కనుక్కోవలసినది ఏమిటి?

విద్యార్థి:
తిన్న చపాతీల సంఖ్య, భాగం.

ఉపాధ్యాయుడు:
ఇచ్చిన లెక్క ప్రకారం మొత్తం చపాతీల సంఖ్య ఎంత?

విద్యార్థి: 15

ఉపాధ్యాయుడు:
మొత్తం చపాతీల సంఖ్యను ఎన్ని సమాన భాగాలుగా చేయాలి?

విద్యార్థి: 5

ఉపాధ్యాయుడు:
మొత్తం చపాతీల సంఖ్యను 5 సమాన భాగాలుగా చేయండి.

విద్యార్థి:
మొత్తం 15 చపాతీలను 3 చొప్పున 5 సమాన భాగాలు చేయాలి.

ఉపాధ్యాయుడు:
తల్లి తిన్న చపాతీల సంఖ్యను ఎలా తెలుసుకోవాలి?

విద్యార్థి:
15 చపాతీలలో 1/5 భాగం తిన్నది
5 భాగాలలో 1 భాగం తల్లి తిన్నది అనగా 3 చపాతీలను తల్లి తిన్నది.

ఉపాధ్యాయుడు:
పిల్లలు తిన్న చపాతీలు ఎన్ని?

విద్యార్థి:
15 చపాతీలలో 3/5 భాగం తిన్నారు.
5 భాగాలలో 3 భాగాలు పిల్లలు తిన్నారు. అనగా 9 చపాతీలను పిల్లలు తిన్నది.

ఉపాధ్యాయుడు:
తండ్రి తిన్న చపాతీలు ఎన్ని?

విద్యార్థి:
15 చపాతీలలో 3 తల్లి తిన్నాది. 9 పిల్లలు తిన్నారు

మొత్తం = 12
మిగిలిన చపాతీలు =15 -12
= 3
తండ్రి తిన్న చపాతీలు = 3

ఉపాధ్యాయుడు: తండ్రి తిన్న చపాతీలు భాగం ఎంత?

విద్యార్థి :

మొత్తం 15 చపాతీలలో 3 తిన్నారు
భాగం = 3/15

5 భాగాలలో 1 భాగం

= 1/5

తల్లి తిన్న చపాతీలు సంఖ్య = 1/5×15 =3
పిల్లలు తిన్న చపాతీలు సంఖ్య = 3/5×15=9

మిగిలినవి = 15-12 = 3

తండ్రి తిన్న చపాతీల భాగం = 3/15=1/5

 

విశ్లేషణ అంటే క్లిష్టమైన వాటిని విడదీయడం వలన వాటి స్వరూపం తెలిసి సాధనను సులభం చేయడం అని అర్ధం. విశ్లేషణ పద్ధతిలో సారంశం నుండి దత్తాంశం ఆధారంగా సమస్యను సాధించడానికి తగిన విధానాన్ని విద్యార్థి తెలుసుకుంటాడు. ప్రతి అంశం మధ్య ఉన్న సంబంధాన్ని విద్యార్థి కనుక్కొని సమస్యను సాధించే విధంగా ఉంటుంది. ప్రతి సోపానం తార్కికంగా సాగుతుంది.

 

మూల్యాంకన ప్యూహాలు :

 

రాత పరీక్ష సామర్థ్య ఆధారిత ప్రశ్నలు

లఘు సమాధాన ప్రశ్నలు

 

1. సమస్యా సాధన : భిన్నాల గుణకారం చేయగల్గుతారు.

3/6×10 మిశ్రమ భిన్నం రూపం ________

2. కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం:
భిన్న భాగాలు కనుగొనడం, వాటి ఆధారంగా ఎక్కువ, తక్కువ, సమాన భాగాలు తెలుసుకుంటారు.

12 లో 1/3 భాగం కనుగొనండి?

3. వ్యక్త పరచడం: భిన్నాలను దశాంశ బిన్నం లోకి, దశాంశ భిన్నాలను శాతంలోకి మార్చగలరు.

190 గ్రా” కిలోగ్రాములలో వ్యక్తపర్చండి.

4. సంబంధాలు :
నిజజీవిత సందర్భంలో బిన్నాలు ఏ విధంగా వినియోగించాలో చెప్పగలుగుతారు.

దీపక్ 5 చాక్లెట్ లలో 2 తిన్న ఇంకా మిగిలిన భాగం ఎంత?

5. ప్రాతినిధ్యపరచడం :

పటాలు పరిశీలించి భిన్న భాగంకి రంగు వేయడం, సమాన భాగాలు గల పటాలను గుర్తించ గలడు. క్రమ, అపక్రమ భిన్నాలు సరిచూడగలడు.

3/2 అనేది క్రమ భిన్నమా?

 

ASSESSMENT Conclusion:

ప్రతి విద్యార్థి ఎంత బాగా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు కు మదింపు సహాయ పడుతుంది. ఒక విద్యార్థి ఏమి చేయగలడో తెలియచెప్పాలి మరియు పురోగతికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక సారి జరిగేలా కాకుండా నిరంతర ప్రక్రియగా సాగాలి.

 

Module -7 School Based Assessment

 

 

Related posts

2 Thoughts to “AP- SCHOOL BASED ASSESSMENT Analysis Methods”

  1. Anonymous

    Module 8 test please

  2. master

    Select Modules category and check last posts.

Leave a Comment