Module 8 AP Pedagogy of Environmental Studies
మాడ్యూలు – 8
పరిసరాల విజ్ఞానం – బోధన (Module 8 AP Pedagogy of Environmental Studies)
పోర్ట్‌ఫోలియో కృత్యము
మాడ్యూలు – 8
పరిసరాల విజ్ఞానం – బోధన
యూనిట్ ప్రణాళిక
తరగతి: 5
అంశం: ప్రజలు – వలసలు
పీరియడ్స్ సంఖ్య : 10
భావనలు :
1. వలస భావన
2. వలసలకు కారణాలు
3. ప్రజలపై వలస ప్రభావం
4. మురికివాడలు
5. మా ఊరు ఎక్కడ?
6. కుటుంబ పద్దు.
7. పొదుపు వలన కలిగే ప్రయోజనాలు
8. మన బడి – మన హక్కు
9. విజయం సాధించడానికి పేదరికం అడ్డంకి కాదు
10. మనం ఏమి నేర్చుకున్నాం
విషయ విశ్లేషణ :
1. ప్రజలు మెరుగైన జీవనం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడాన్ని వలస అంటారు.
2. వలసలకు ప్రధాన కారణాలు
i. సహజ కారణాలు
ii. ఆర్థిక కారణాలు
3. తల్లిదండ్రులు పిల్లలును తమతో పాటు వలస తీసుకుపోతారు. అది పిల్లలు చదువు మీద ప్రభావం చూపుతుంది.
4. పల్లెల నుండి పట్టణాలకు వలస విపరీతంగా పెరగడం వలన వలస కూలీలు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు మురికివాడలు దగ్గర నిర్మించుట.
5. పల్లెల్లో సొంత ఊరు, బంధువులు, స్నేహితులుతో కలిసి ఉండడం. కష్టసుఖాల్లో వారందరూ సాయం చేసుకోవడం గుర్తు చేసుకోవడం.
6. కుటుంబ ఖర్చులు వివరాలు తెలియపర్చుట.
7. భవిష్యత్తు అవసరాలు కోసం డబ్బులు పొదుపు చేయడం. ఖర్చు, వడ్డీ గురించిన వివరాలు.
8. మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారం, ఉచిత పాఠ్యపుస్తకాలు గూర్చి తెల్పుట.
9. అబ్దుల్ కలాం జీవిత ఘట్టం వివరణ.
10. వలసలు దాని ప్రభావం, పేదరికం, బడ్జెట్, పొదుపు వివరాలు సమగ్రపర్చుట.
అభ్యసన లక్ష్యాలు/ఫలితాలు :
వలస భావనను వాటి ప్రభావం విద్యార్థి అవగాహన చేసుకుంటాడు.
కుటుంబ అవసరాలు ఆర్థికంగా ఎలా తీర్చుకోవాలో గ్రహిస్తారు.
విద్యార్థులు కుటుంబం యొక్క ఆర్థిక స్థితి అవగాహన చేసుకుంటాడు.
పేదరికం, నిరుద్యోగం వలసలకు ప్రధాన కారణమని తెలుసుకుంటాడు.
మానవులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు ఏవో తెలుసుకుంటాడు.
పొదుపు చేయడం నేర్చుకుంటాడు.
చదువు బాలల హక్కు అని గ్రహిస్తారు.
ప్రభుత్వం అందించే వివిధ పథకాలు గురించి తెలుసుకుని అభినందిస్తారు.
వనరులు :
1. కొత్తగా గ్రామానికి వలస వచ్చిన కుటుంబాలు సందర్శించడం.
2. వలస కూలీలు చేస్తున్న పనులు వీక్షణంకు పరిసరాలుకు వెళ్లుట.
3. మురికివాడల సందర్శన.
4. పొదుపు ఆవశ్యకత తెలియజేయుటకు స్ధానిక తపాలా కార్యాలయం సందర్శన.
కృత్యాలు :
1. కొత్తగా వలస వెళ్లిన లేదా వచ్చిన వారి వివరాలు సేకరించుట.
2. విద్యార్థులు నెలవారీ కుటుంబ ఖర్చులు వివరాలు పట్టికలో రాయడం.
3. పరిసరాలలో పిల్లలు బడి మానివేయడానికి కారణాలు వ్రాయడం.
మూల్యాంకనము-మదింపు పక్రియ:
1. వలస వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు రాయండి.
2. వలసలకు కారణాలు తెలుసుకోవడానికి నువ్వు వారికి ఏయే ప్రశ్నలు అడుగుతావు?
3. వలస కుటుంబాలు పరిశీలించి COVID -19 లో వారి అనుభవాలు నమోదు చేయండి.
4. పిల్లలు బడి మానివేయడానికి కారణాలు రాయండి.
5. వలస కారణాలు చూపించే ఊహ చిత్రం.
6. బడి మానివేసిన పిల్లలు తిరిగి బడిలో చేరడానికి నువ్వు ఏ విధంగా ప్రోత్సాహిస్తావు.
Conclusion:
పరిసరాల విజ్ఞానం ద్వారా విద్యార్థి బాహ్య ప్రపంచం గూర్చి తెలుసుకుంటాడు. ప్రతి తరగతిలో తగిన అభ్యసన ఫలితాలు యూనిట్ ప్రణాళిక ద్వారా అందించ గలగాలి. విద్యార్థుల అవసరాలు, అభిరుచులు దృష్టిలో ఉంచుకొని యూనిట్ నిర్మాణం జరగాలి. నూతన అనుభవాలు కల్పించాలి. లక్ష్యాలు సాధించే విధంగా రూపొందాలి. యూనిట్ ప్రణాళిక తరువాత Lesson Plan రూపొందించి ప్రతీ పీరియడ్ లో పూర్తి చేయవలసిన కృత్యాలు రూపొంచాలి.
Download copy Adobe నందు open చేయండి. మీ Name, School Name type చేసుకోండి.