Module – 9 Pedagogy of Mathematics
మాడ్యూలు – 9
గణిత బోదన – సహిత విద్య – చట్టబద్ధ విధాన చట్రం( Module – 9 Pedagogy of Mathematics )
పోర్టు ఫోలియో కృత్యం
భిన్నాల భాగాహారం
3/5 ÷ 4 ?
3/5 ÷ 4 = 3/5 ×1/4
= 3/20
పై సమస్యను కృత్యం ఉపయోగించి విద్యార్థులు తో చేయుట.
కృత్యపత్రం
అంశం: భాగాహారం
శీర్షిక: భిన్నాల భాగాహారం
కావలసిన సామాగ్రి: గళ్ల కాగితం
కృత్యం:
3/5 ÷ 4 భాగాహారం చేయండి.
మీరు చేయాల్సింది:
పేపరు తీసుకొని 5 సమాన భాగాలుగా తయారు చేయండి.
పేపరులో 3/5 భాగాన్ని అడ్డు గీతలతో పూరించండి.
మళ్ళీ పేపరు 4 సమాన భాగాలుగా చేయండి.
ఇప్పుడు పేపరు గళ్ల కాగితం మాదిరిగా తయారుచేయండి.
ఇప్పుడు 3/5 భాగంలో 1/4 వ భాగాన్ని నిలువ గీతలతో పూరించండి.
రుబ్రిక్స్:
1. గళ్ల కాగితంలో మొత్తం గడుల సంఖ్య ఎంత?
2. గళ్ల కాగితంలో అడ్డు, నిలువ గీతలు ఉన్న గడుల సంఖ్య ఎంత?
3. 3/5 భాగంలో 1/4 భాగం ఎన్ని గడులు ఆక్రమించింది?
4. మొత్తంగా గళ్ల కాగితంలో అడ్డు, నిలువ గడుల భాగం భిన్న రూపం రాయండి.
5. 2/3 ÷ 5 ను భాగించండి.
గణిత విద్యతో సంబంధం గల NCF – 2005 యొక్క 3 సిఫార్సులు
అమూర్తీకరణ:
విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే భావనలను సంఖ్యలు, సంకేతాలు, గుర్తులు, ఉపయోగించి అభ్యసన చేయడం ద్వారా అమూర్తీకరణ చేసుకుంటారు. గణితం అమూర్త భావనలు ఎక్కువగా కలిగి ఉండుట వలన విద్యార్థులు అవగాహన చేసుకోలేరు. విద్యార్థులుకు ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో మూర్త స్థాయి అనుభవాలను కలిగించి అభ్యసనను అమార్తీకరణం చేయాలి.
తార్కికత:
తర్కంతో కూడినది గణితం. తార్కిక ఆలోచనలు కలిగించేది గణితం. గణిత తార్కిక ఆలోచనలు ద్వారా విషయ నిర్ధారణ, కచ్చితత్వం, వేగం, ఫలితాలు విశ్లేషణ మొదలైన భావాలు పెంపొందించేలా చేయాలి.
సంపూర్ణ అవగాహన:
గణిత అధ్యయనం ద్వారా విద్యార్థి రోజువారి కృత్యాలు అంకెలు, సంఖ్యలు లెక్కింపు, అమ్మకం, కొలతలు, సరుకులు వినియోగం, ఆదాయం, లాభనష్టాలు, సమయం, నిత్య జీవితంలో గణిత ఉపయోగం మొదలైన అంశాలు సంపూర్ణ అవగాహన చేసుకోవడానికి గణితం ఒక మార్గంగా ఉంది.
NCF – 2005 ఆధారంగా పాఠశాల గణితం కొరకు మూడు దృశ్య ప్రకటనలు :
1. భారం లేని విద్య:
గణితం నేర్చుకొనుట అనేది పాఠ్యపుస్తకాలకే పరిమితం కారాదు. విద్యార్థులు గ్రహించిన జ్ఞానం నిత్యజీవితంలో ఎక్కువగా వినియోగించుకోవాలి. ఆందోళన, పోటీతత్వం అధిగమించేలా పరీక్షలు విధానాన్ని మార్పులు చేసి రూపొందించాలి. పరీక్షలు విధానాన్ని సంస్కరించాలి.
2. పాఠ్య పుస్తకాల మార్పు:
పాఠ్య పుస్తకాల రూపకల్పన విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించాలి. సబ్జెక్టు ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాలు విద్యార్థులు సాధించగలగాలి. విషయ స్వభావము, పిల్లలు స్వభావం వంటివి పాఠ్యపుస్తకాల రూపణలో పరిగణనలోకి తీసుకోవాలి.
3. మూల్యాంకనము చేయాలి:
పిల్లలు అభ్యసనాన్ని మూల్యాంకనము చేయడం ద్వారా వారు సాధించిన లక్ష్యాలు తెలుసుకోవచ్చు. మరలా పునర్బలనము కల్పించి ఆశించిన సామర్థ్యాలు విద్యార్థి సాధించిన విధంగా చేయవచ్చు. బట్టీ విధానాలు బదులు బోదనభ్యసన పక్రియలు వినియోగించాలి.