AP- Pedagogy of Social Sciences
మాడ్యూలు – 10 సాంఘికశాస్త్ర భోధనా పద్ధతులు (AP- Pedagogy of Social Sciences)
పోర్ట్ ఫోలియో కృత్యం
సాంఘిక శాస్త్రంలో కృత్యాధార బోధన
సబ్జెక్టు: సాంఘిక శాస్త్రం
గ్రేడ్ / తరగతి: 6th
అధ్యాయం: ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు – ఆదిమానవులు
అంశం: రోడ్డు రవాణా, మార్కెట్ సౌకర్యం
ఆశించిన అభ్యసన ఫలితాలు:
వివిధ రవాణా సౌకర్యాలు గురించి అవగాహన చేసుకుంటారు.
రవాణా సౌకర్యాలు ఉపయోగం తెలుసుకుంటారు.
గ్రామంలో లభించే మరియు లభించని వివిధ ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు గుర్తిస్తారు.
గ్రామంలో మార్కెట్ అవసరం తెలుసుకుంటారు.
వివిధ రకాల రవాణా సౌకర్యాలును ప్రశంసిస్తారు.
కీలక భావనలు లేదా విషయం:
గ్రామానికి వచ్చి వెళ్లే లారీ, ట్రాక్టర్ల, బస్సులు, వ్యాన్, ట్రక్కులు వంటి వివిధ రకాల రవాణా సౌకర్యాలు గూర్చి విద్యార్ధులుకు తెలియపరచాలి. అంతే కాకుండా రోడ్డు రవాణా వ్యవస్థ ఉపయోగం ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించాలి. సరుకుల రవాణా ఆవశ్యకత వాటి వినియోగం, ఆర్థిక పరమైన అంశాలు గూర్చి విద్యార్ధులుకు వివరించాలి. గ్రామంలో రైతు బజారు లేదా మార్కెట్ విలువ దాని వినియోగం తెలియపరచాలి. గ్రామం నుండి వివిధ ప్రాంతాలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి గ్రామంలోకి రవాణా చేయబడిన వస్తువులు వాటి వినియోగం తెలియపరచాలి.
పూర్వ జ్ఞానం:
పాఠ్యాంశం బోధించక ముందు రవాణా వ్యవస్థ పై విద్యార్ధులుకు కొంత అవగాహన కలిగి ఉంటారు. తేలిక పాటి, బరువైన సామాగ్రి మోసుకుపోయే వివిధ రకాల రవాణా సౌకర్యాలు నిరంతర పరిశీలనలో వారు ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు.
విద్యార్ధులుకు మరింత సమగ్ర సమాచారంతో రవాణా వ్యవస్థ గురించిన జ్ఞానం, అవగాహన అందించే విధంగా ప్రణాళిక రూపకల్పన చేయాలి.
అభ్యసన మదింపు కొరకు ప్రణాళిక:
రవాణా సౌకర్యాలు అంశం కృత్యాధార భోధన ద్వారా విద్యార్ధులుకు తెలియపర్చుట. దీని కొరకు ప్రొజెక్ట్ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయుల
కృత్య పత్రం
తరగతి: 6th
విషయం: సాంఘిక శాస్త్రం
అంశం: రోడ్డు రవాణా, మార్కెట్ సౌకర్యం
శీర్షిక: మన రవాణా సౌకర్యాలు గురించి తెలుసుకుందాము.
మీరు చేయాల్సింది:
వివిధ వాహనాల ద్వారా రవాణా అవుతున్న వాటి వివరాలు సేకరించడం.
మండలం పటం గీయండి, రోడ్డు మార్గాలు గుర్తించడం.
మీకు కావలసినవి: తెల్లకాగితం, మండల పటం, రంగులు
కృత్యం:
మీరు సేకరన చేయవలసిన వివరాలు
ఒక 15 రోజులు పాటు మీ గ్రామానికి వచ్చే అన్ని వాహనాలు గమనించండి. వాహనం పేరు, వాటి ద్వారా ఏవి రవాణా అవుతోంది వివరాలు పట్టిక నందు నమోదు చేయండి.
1 వ రోజు – సైకిల్ – ఐస్ క్రీమ్
2 వ రోజు – స్కూటర్ – ఆవకాయ పచ్చడి
3 వ రోజు – బైకు – కుర్చీలు
4 వ రోజు – ట్రాక్టర్లు- ఇసుక
6 వ రోజు – ఆటో – బత్తాయి పండ్లు
7 వ రోజు – ఎద్దుల బండి – ధాన్యం బస్తాలు
8 వ రోజు – బస్సు – బంతి పూల బుట్టలు
9 వ రోజు – లారీ – ఉల్లిపాయలు
10 వ రోజు – వాను – రేషన్ బియ్యం
11 వ రోజు – ట్యాంకర్ల లారీ – నీరు
12 వ రోజు – తోపుడు బండి – కూరగాయలు
13 వ రోజు – రైలు – ఆపిల్ Box
14 వ రోజు – మినీ వాన్ – మినరల్ వాటర్ బాటిల్స్
15 వ రోజు – అంబులెన్స్ – మందులు
మ్యాప్ గుర్తింపు:
మీ మండల చిత్రాన్ని సేకరించండి. దానిలో వివిధ గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలకు గల రోడ్డు మార్గాలను గుర్తించండి. వివిధ రకాల రోడ్లను వేరు వేరు రంగులతో గుర్తింపచేయండి.
[…] Observe the picture carefully and complete the description […]