Module 13 AP-School Leadership Concepts and Application
మాడ్యూలు – 13
పాఠశాల నాయకత్వం
పోర్ట్ ఫోలియో కృత్యం
పాఠశాల నాయకత్వం
నాయకత్వం అనేది అన్ని రకాల నేపధ్యాలను కలగలపి పాఠశాల నాయకుడికి కావలసిన నైపుణ్యాలను అందించే సమగ్ర అంశం. పాఠశాల నాయకుడికి చాలా బాధ్యతలు ఉంటాయి. విద్యార్థులకు గుణాత్మక మరియు అర్ధవంతమైన, ఫలవంతమైన అభ్యసనానుభవాలు అందించాలి. అవి భద్రత మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణం నెలకొల్పడం. సామాజిక మరియు వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేయడం. శ్రేయస్సు, స్వతంత్ర మరియు సహకార ఆలోచన వంటివి విద్యార్థులకు పెంపొందించడం.
పాఠశాల నాయకత్వం అనేది విద్యార్థుల అభ్యసనను మెరుగుపరుస్తుంది. నిర్దేశిత సమయంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం. నిర్ణయించిన దార్శనికత, గమ్యాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు మరియు వ్యుహలతో పాఠశాల బృందం సమిష్టిగా తయారుచేయడం. పాఠశాల సిబ్బంది ద్వారా ప్రజలు, తల్లిదండ్రులు ఇతర భాగస్వామయులు సంపూర్ణ సహకారంతో పాఠశాలలోనే తయారు చేయడం.
1. దార్శనికత విలువలతో పాఠశాల అభివృద్ది చేస్తూ పిల్లలు అందరూ అభ్యసించగలరనే నమ్మకం పెంచాలి.
2. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక కోసం కమిటీలు ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు పంచాలి. ఉపాధ్యాయులు అందరి సామర్థ్యాలు, నైపుణ్యాలను వినియోగించడం.
3. పాఠశాల సమాచారం, విద్యార్థుల నమోదు సమాచారం, నూతన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అవసరాలు, గ్రామ జనాభా, భాగస్వాములుగా పాల్గొన్న వారి వివరాలు సేకరించుట.
4. పేరంట్స్ కమిటీ నిర్వహించి పాఠశాల స్థితి వివరించడం. ప్రభుత్వ పథకాలు వివరించుట, లబ్ధిదారుల వివరాలు ప్రదర్శనలు చేయుట. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్దవంతంగా నిర్వహణ చేయడం. Dry Ration పంపిణీ చేయడం.
5. JVK Kits పంపిణీ చేయడం. Eco Club పాఠశాల నందు నిర్వహించడం. పాఠశాల ఉత్సవాలు నిర్వహించడం.
ఈ విధంగా పాఠశాల నాయకత్వం అనేది నాణ్యమైన విద్యను అందించడానికి మరియు విద్యార్థుల యొక్క అభ్యసనను మెరుగుపరుస్తుంది.
ఉపాధ్యాయ నాయకత్వం
ఉపాధ్యాయ నాయకత్వం అనేది నిరంతర జ్ఞానం, నైపుణ్యాలు, మరియు వివిధ పద్ధతులను ఆర్జిస్తూ తన బోధనా అభ్యసనలను మెరుగుపరుచుకుంటూ మరియు ప్రసృత సవాళ్లు అధిగమిస్తూ విద్యార్థుల అవసరాలను తీర్చాలి.
1. ప్రయోగాలకు చొరవ చూపడము, వైవిధ్యమైన జ్ఞాన సముపార్జన మరియు అభ్యసన పక్రియలో కొత్త వృత్తిపరమైన పద్ధతులు రూపొందించుట.
2. ప్రతిస్పందించే అభ్యాసకునిగా మారటం.
తరగతి గదులు, పాఠశాల లోపల మరియు బయట అనుకూల అభ్యసన పరిస్థితి కల్పించాలి.
3. వ్యక్తిగత మరియు సహకార అభ్యసన కల్పన. విద్యార్థులను వివిధ కృత్యాలలో నిమగ్నం చేసే అవకాశాలు కల్పించడం.
4. తన సామర్ధ్యం ఉపయోగించి తరగతి నిర్వహణ మరియు సాధారణ సమస్యలు పరిష్కారం చేయుట.
5. అభ్యసన వాతావరణంలో సమాచార సాంకేతిక ICT వినియోగించుట. వివిధ సాంకేతిక సాధనాలు మరియు వనరులను సేకరించుట.
ఉపాధ్యాయ విద్యను సమర్ధవంతంగా చేయడానికి వృత్యంతర విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం. వృత్తిపరమైన అభివృద్ధి కోసం సెమినార్లు, వర్క్ షాపులు, సమావేశాల్లో పాల్గొనడం. వృత్తి సంబంధించిన విద్యార్హతలు పెంపుదల చేయడం, బోధన అభ్యసన మూల్యాంకనానికి సంబంధించిన కార్యక్రమాలు, నూతన పద్ధతులు ఉపయోగించడం మొదలైనవి ఉపాధ్యాయ నాయకత్వంను Leadership మెరుగుపరుస్తాయి.
Download Copy
Your are very good
Thanks for your help
Please post portfolio for 11th Module
Thank you
https://master.army/2020/10/23/modules-qustionsanswers-10-10-marks/
You are most welcome