Module – 14 AP Initiatives in School Education
మాడ్యూలు 14
పాఠశాల విద్యలో కార్యక్రమాలు
పోర్ట్ ఫోలియో కృత్యం
*సవాళ్లు – పరిష్కారాలు*
1. కోవిడ్ – 19 నుండి రక్షణ మరియు భద్రత హామీ:
ప్రపంచ వ్యాప్తంగా 2020-21 సంవత్సరంలో కోవిడ్ – 19 వలన అకస్మాత్తుగా ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితులకి దారితీసింది. ఈ స్థితిని అధిగమించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తూ, అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ పరిస్థితి లో అభ్యసనం ఆటంకం లేకుండా తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరణ.
ముందుగా తల్లిదండ్రులకు కోవిడ్ – 19 వ్యాధి పై అవగాహన కల్పించాలి. కోవిడ్ – 19 వ్యాధి లక్షణాలు మరియు దాని ద్వారా వచ్చే సమస్యలు, వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలు, నిరోధక శక్తిని పెంచే విధానాలు గూర్చి పూర్తిగా వివరించాలి. విద్యార్థులకు వ్యాధి సంక్రమణ లేకుండా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా వివరించాలి. అంతే కాకుండా విద్యార్థులకు అభ్యసన కృత్యాలు ఇంటి వద్ద అందించడంలో, అభ్యసన కృత్యాలు పూర్తి చేయడంలో తల్లిదండ్రులకు మరియు PMC కమిటీకి తగు సూచనలు వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన తరగతులు నిర్వహించాలి. విద్యార్థి ఇంటి వద్ద నుండి ఆన్లైన్ అభ్యసన తరగతులను పూర్తి చేయడానికి కావలసిన Mobile, టెలివిజన్ సౌకర్యాలు అందే విధంగా తల్లిదండ్రులకు సూచనలు చేయడం. పాఠశాలకు హాజరైన విద్యార్థులు మాస్క్ ధరించి రావడం, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ వాడకం, దూరం పాటిస్తూ మసులు కోవడం వంటి వాటిని తప్పకుండా పాఠశాల లోపల మరియు బయట పాటించే విధంగా చేయాలి. విద్యార్థికి మానసిక స్థ్తెర్యాన్ని కలిగించాలి.
2. ఉత్తమ అభ్యాసాలు:
అభ్యసనం అనేది తరగతిలో ప్రతి విద్యార్థికి అందించవలసిన అవసరం మరియు ఆవశ్యకత కలది. ఇందు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొంత మంది విద్యార్థులు వెనకబడిపోవుట. దీనిపై కొంత అవగాహన.
తరగతిలో వెనకబడిన విద్యార్థులు పై ప్రత్యేక శ్రద్ధ వహించుట. పూర్తి వ్యక్తిగత అభ్యసనం కల్పించుట. విద్యార్థులు స్థాయి బట్టి అభ్యసన కృత్యాలు స్వయంగా ఉపాధ్యాయులే రూపకల్పన చేయుట. వెనకబడిన విద్యార్థులు అభ్యసన విషయం అవగాహన చేసుకునే విధంగా అభ్యసన జరుపుట. ఇటువంటి అభ్యసన కు మూర్త అనుభవంకు ప్రత్యక్ష అనుభవాలను కల్పించి, అమూర్త అనుభవంకు ICT విస్తృతంగా వినియోగం చేయుట. ఆసక్తి రేకిత్తించే ఆన్లైన్ అభ్యసన కృత్యాలు ఎంపిక చేయూట. మొదలైన పద్ధతులు పాటిస్తూ ఉపాధ్యాయులు అభ్యసనంపై విద్యార్థి మానసిక ధైర్యాన్ని మెరుగుపరచాలి.
3. మధ్యాహ్న భోజన పథకం అమలు:
కోవిడ్ – 19 కారణంగా విద్యాసంస్ధలు మూతబడి నప్పటికి విద్యార్థులకు పోషకాహారం ప్రతీ నెల Dry Ration రూపంలో అందించవలసిన ఆవశ్యకత.
కోవిడ్ – 19 పరిస్థితిలో విద్యార్థి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనందున, దీని ప్రభావం విద్యార్థి అభ్యసనం పై, వ్యాధి నిరోధకత పై పడకుండా మరియు విద్యార్థికి ఎటువంటి పోషకాహార లోపం లేకుండా Dry Ration రూపంలో పోషకాహారం విద్యార్థి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుంది. ప్రతి నెలా Dry Ration విద్యార్థికి అందే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా పాఠశాలకు హాజరైన విద్యార్థులు మధ్యాహ్న భోజనం పూర్తిగా తీసుకునే విధంగా వారిని ప్రేరణ కలిగించాలి. కుల, మత, లింగ బేధాలు లేకుండా గుడ్డు వంటి పోషకాహారం అందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో ప్రతి రోజు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలి. పోషకాహారం విద్యార్థికి అందించ వలసిన ప్రాధాన్యత, ఆవశ్యకతను PMC ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. School Education.