Module -15 AP Preschool Education
మాడ్యూలు – 15
పూర్వ ప్రాథమిక విద్య
పోర్టు ఫోలియో కృత్యం
భావన / అంశం:
పరిసరాలలో వివిధ జంతువులు గూర్చి అవగాహన కల్పించడం.
గ్రేడ్ : PS – 3
పూర్వ జ్ఞానం:
పిల్లలు ప్రీ స్కూల్ కి వచ్చేసరికి వారి కుటుంబం, సమాజం మరియు పరిసరాలకు సంబంధించిన పూర్వ జ్ఞానం కలిగి ఉంటారు. దీనిని ఉపాధ్యాయులు తగిన విధంగా ఉపయోగించి పిల్లలు ప్రీ స్కూల్ అభివృద్ధికి దోహదపడాలి. ప్రధానంగా భాషను అభివృద్ధి చేయాలి. ప్రీ స్కూల్ దశలో వివిధ నైపుణ్యాలును అభివృద్ధి చేయాలి.
అభ్యసన సామాగ్రి:
జంతువుల ఛార్టు, బొమ్మలు, పేపర్లు, రంగులు.
విషయ అవగాహన:
ప్రీ స్కూల్ అభ్యసన చేయడానికి ప్రారంభ అక్షరాస్యత నైపుణ్యాలును పిల్లలకు ఉపాధ్యాయులు అందించాలి. సంభాషణలు, చర్చలు, ఛార్టు చూపించి ధ్వనిని అవగాహన చేయడం వంటివి కృత్యాలు మరియు ఆటలు ద్వారా పిల్లలకు నేర్పించాలి. పిల్లలు తమ నివాస గృహాలు మరియు పరిసరాల్లో గల కీటకాలు, పక్షులు, జంతువులను గుర్తిస్తారు. ఛార్టు చూసి జంతువులను గుర్తించమనాలి. పక్షులు, జంతువులు, కీటకాలు ఉన్న ఛార్టు ను పిల్లలకు చూపాలి. పిల్లలచే జంతువులను గుర్తించమనాలి.
కృత్యాలు – ఆటలు:
పిల్లలు అందరినీ గుండ్రంగా నిల్చోమనాలి. బంతి ఆట ద్వారా పిల్లలచే ఒక్కొక్క జంతువు పేరు చెప్పమనాలి.
జంతువులు, పక్షులు ఉన్న ఛార్టును పిల్లలకు చూపాలి.
ఛార్టు నందలి జంతువుల పేర్లు ఒక్కొక్కరు చెప్పమనాలి.
పిల్లలతో జంతువులు, పక్షులు అరుపులను పలికించాలి.
జంతువులు, పక్షులు గురించి మాట్లాడించాలి.
పిల్లలచే మీకు ఏ జంతువు ఇష్టము చెప్పమనాలి.
ఛార్టు నందలి జంతువుల్లో వారి ఊరిలో ఉండే జంతువులు ఏవో గుర్తించమనాలి.
ఛార్టు చూసి జంతువుల్లో అడవిలో ఉండే జంతువులు ఏవో గుర్తించమనాలి.
ఎవరెవరి ఇళ్లలో ఏ ఏ జంతువులు ఉన్నాయో చెప్పమనాలి.
ఛార్టు నందలి జంతువులు ఏ ఏ ఆహారాన్ని తీసుకుంటాయో చెప్పమనాలి.
ఛార్టు నందలి జంతువులు ఎక్కడ ఎక్కడ నివాసం ఉంటాయో చెప్పమనాలి.
పక్షులు, జంతువులు మధ్య తేడాలు చెప్పమనాలి.
పై ఛార్టు ఆధారంగా కుక్క కంటే పెద్దవి ఏవి? చిన్నవి ఏవి ? చెప్పమనాలి.
ఉపాధ్యాయుడు ఛార్టు మీద బొమ్మ చూపి అది చేసే శబ్దం అనుకరించమనాలి. ఆలస్యం అయితే ఆట నుంచి వారు తొలిగిపోవాలి. చివరకు మిగిలిన వారే విజేత.
ప్రాజెక్టు పనులు: Preschool Education
పిల్లలచే పక్షులు, జంతువుల బొమ్మలు సేకరించమనాలి. చుక్కలు కలిపి బొమ్మలు గీయమనాలి. పిల్లల బొమ్మలు వారికి వచ్చి నట్లు గీయమనాలి. కాగితాల పై బొమ్మలు గీయమనాలి. జంతువులు బొమ్మలకు రంగులు వేయండి.
ప్రారంభ అభ్యాస ఫలితం:
పరిసరాలలో ఉన్న వివిధ జంతువులు గూర్చి మరింత అవగాహన పొందుతారు.
జంతువులు, పక్షులు, మధ్య పోలికలు తేడాలు గుర్తించ గలరు.
పెంపుడు జంతువులను గుర్తిస్తారు.
అడవిలో జంతువులను గుర్తిస్తారు.
పెద్ద, చిన్న జంతువులు గుర్తిస్తారు.
ఎప్పుడూ చూడని జంతువులు గుర్తిస్తారు.
పరిసరాలలో గల వివిధ జంతువులు చేసే అరుపులు అనుకరిస్తారు. వాటిని నోటితో ఉత్పత్తి చేస్తారు.
బొమ్మలు గీయడం నేర్చుకుంటారు.