Module 16 AP Pre Vocational Education
మాడ్యూలు – 16
పూర్వ వృత్తి విద్య
పోర్ట్ ఫోలియో కృత్యం
జామ్ తయారీ
తరగతి: 6
సబ్జెక్టు: విజ్ఞాన శాస్త్రము
అంశం: ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది.
రంగము: ఆహార ప్రొసెసింగ్
లక్ష్యాలు:
ఈ కృత్యం పూర్తి చేయుసరికి విద్యార్థులు ఈ కింది లక్ష్యాలు సాధిస్తారు.
విద్యార్థులు జామ్ తయారు చేస్తారు.
ఆహార ప్రొసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గుర్తిస్తారు.
జామ్, జెల్లీ వంటి పదార్థాలను స్వయంగా తయారు చేస్తారు.
పూర్వ వృత్తి విద్య నైపుణ్యాలు అలవడుతాయి.
విద్యార్థులు పాఠశాల జీవితం నుండే సరైన పనిని ఎన్నుకొని, భవిష్యత్ లో ఉపాధిని పొందే నైపుణ్యం మరియు వైఖరి అలవడుతుంది.
కృత్యం: జామ్ తయారీ
కావల్సిన వస్తువులు, పదార్థాలు:
స్టీల్ పాత్ర
గ్యాస్ స్టవ్
1 కిలో చక్కెర
1 కిలో ఆపిల్ పండ్లు
1 చెంచా నిమ్మరసం
1 కప్పు నీరు
గాజు జాడి
కొన్ని సుగంధ ద్రవ్యాలు (సోంపు, దాల్చిన చెక్క, యాలకలు)
తయారీ విధానం:
దశ 1: పరిశుభ్రమైన ఆపిల్స్ ను నీటితో కడగండి మరియు పై తొక్క తీయండి.
దశ 2: ఆపిల్ ని చిన్న ముక్కలుగా కోయండి.
దశ 3: ఆపిల్ ముక్కలను స్టీల్ పాత్ర లో వేసి తగినంత నీరు చేర్చండి. పొయ్యి వెలిగించి, ఐదు నిమిషాలు ఉంచండి. పాత్ర పై మూత పెట్టి ఉంచండి.
దశ 4: ఆపిల్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వాటిని ముద్దుగా గుజ్జుగా చేయండి.
దశ 5: చక్కెర మరియు సుగంధ ద్రవ్యాలు పొడిని ఆపిల్ మాష్ కి చేర్చి బాగా కలియ పెట్టండి.
దశ 6: జామ్ పదార్థాన్ని ఎప్పటి కప్పుడు తనిఖీ చేయండి. జామ్ చిక్కగా తయారు అయ్యే వరకు కలియ బెట్టండి.
దశ 7: ఇప్పుడు పొయ్యి ఆపి పాత్రను బయటకు తీసి జామ్ లో కొద్దిగా నిమ్మరసం జోడించండి.
దశ 8: జామ్ చల్లబడిన తర్వాత గాజు సీసా నందు నింపి ఫ్రిజ్ లో నిల్వ చేయండి.
దశ 9: జామ్ తయారుచేసిన విధానం విద్యార్థులు చే మరల మరల చేయించడం చేయాలి.
దశ 10: విద్యార్థులు ఆపిల్ జామ్ రుచి చూస్తారు.
తదనంతర కృత్యం:
విద్యార్థులను వివిధ రకాల ఆహార ప్రొసెసింగ్ కేంద్రాలు వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ జరిగే పక్రియలు, విధానాలును చూపించాలి. అక్కడ పనిచేసే కార్మికులు చేసే పనులు పరిశీలన చేయమనాలి. కార్మికులను ప్రశ్నించడం వలన జామ్ తయారీ విధానాన్ని, మెలుకవలను తెలుసుకోవచ్చు. ఇంటి దగ్గర మరియు కర్మాగారంలో తయారీ విధానాల తేడాలు విద్యార్థులు గుర్తించ గలరు. ఆపిల్స్ తో పాటు ఇతర స్థానికంగా దొరికే పండ్లను జామ్ తయారీ నందు ఉపయోగిస్తారు.
Conclusion:
ఈ విధంగా ఉపాధ్యాయులు పూర్వ వృత్తి విద్య దశలో వివిధ రకాల కృత్యాలు నిర్వహించి భవిష్యత్తు లో విద్యార్థులు వివిధ రకాల వృత్తులను ఎన్నుకొని ఉపాధి అవకాశాలు పొందేందుకు సిద్ధంగా చేయవలెను. ఇప్పటి నుండి ఆయా Vocational Education వృత్తి నైపుణ్యాలు విద్యార్థులుకు అలవడుతాయి.