Child Care Leave Enhancement of maximum Spells up to 10
11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ 10 విడతల్లో ఈ సెలవులను వినియోగించుకునేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా కొన్ని రోజులు పిల్లల సంరక్షణ సెలవులు వినియోగించుకుంటే.. మిగతా సెలవులను కూడా పది విడతల్లో వినియోగించు కునేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
చైల్డ్ కేర్ లీవ్ గతంలో 60 రోజులు వుండేది. పి.ఆర్.సి.లో భాగంగా 180 రోజులకు పెంచారు. ఈ సెలవును గరిష్టంగా 10 స్పెల్ లలో ఉపయోగించుకోవచ్చు. అయితే గతంలో 60 రోజులు వున్నపుడు వాడుకున్న స్పెల్స్ తో సంబంధం లేకుండా పెంపు జి. ఓ. విడుదల అయిన 8-3-2022 నుండి మిగిలిన సెలవులను 10 స్పెల్స్ వరకు ఉపయోగించుకోవచ్చు.
ఉదా:
8-3-222 కు ముందు ఒక టీచర్ మొదటి విడత 20 రోజులు, రెండో విడత 15 రోజులు ఉపయోగించుకున్నారు. అంటే మొత్తం 35 రోజులు ఉపయోగించారు. అంటే మిగిలిన 145 రోజులను గరిష్ఠంగా 10 స్పెల్స్ వరకు ఉపయోగించుకోవచ్చు..
Child Care Leave G.O.
180 రోజుల చైల్డ్ కేర్ లీవ్లను 10 విడుతలలో ఉపయోగించుకోవాలని రివైజ్డ్ ఉత్తర్వులు
సరోగసి ద్వారా తల్లి అయిన మహిళా ఉపాధ్యాయులకు కూడా 180 రోజుల మెటర్నిటీ సెలవు మంజూరు
180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ CCL అదనం, ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండే వరకు CCL అనుమతించాలి. 40% ఆ పై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరు చేయాలి.
ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
మహిళా ఉద్యోగుల, టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే CCL మంజూరు చేస్తారు. పిల్లల పరీక్షలు, అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర
అవసరాలకు CCL మంజూరుచేయాలి.
శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు. కేవలం సెలవు పత్రం సమర్పించి CCL పై వెళ్ళకూడదు. అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.
మొదటి విడత CCL మంజూరు సమయంలో పుట్టిన తేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి. ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.
ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.
ఆకస్మికేతర సెలవు (OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.
రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుప కూడదు.
Child Care Leave
11 వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంపకం నిమిత్తము లేక పాఠశాల కాలేజి స్థాయి పరీక్షల సమయంలోనూ, వారి ఆనారోగ్య సమయంలలో, వగైరాలకు 180 రోజులు వరకు శిశు సంరక్షణ సెలవులు క్రింద తెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది.
ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు మాత్రమే క్రింది నిబంధనలు అనుసరించి వినియోగించుటకు అవకాశము కల్పించబడినది.
1. ఈ సెలవులను 3సార్లు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18 సం”ల వరకు మరియు అశక్తులైన పిల్లల యొక్క (మానసిక శారీరక వికలాంగులు) వయస్సు 22 సం”లలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.
2. ఈ సెలవులను LTC, నిమిత్తంగా వాడుకొనుటకు అవకాశము లేదు.
3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ.నందు పొందు పరచబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా ELS
మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వీసు రిజిష్టరు నందు నమోదు పరచుకొనవలెను.
4. ఈ సెలవులు ELs మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.
5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.
6. ఈ సెలవులు వినియోగించుకొనుట హాక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించు కొనవలెను.
7. ఈ సెలవులు సంపాదిత సెలవులు గానే పరిగణించాలి.
8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని వినియోగించుకొనవచ్చు.
9. ఉద్యోగిని యొక్క ప్రొబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము
పొడిగించబడును.
10. ఈ సెలవులను లీవ్ – నాట్ – డ్యూ గా అవకాశము కలదు.