Module 17
AP Covid 19 Addressing Challenges in School Education
మాడ్యూలు – 17
కోవిడ్ 19 పరిస్థితులు:
పాఠశాల విద్యలో సవాళ్లను అధిగమించడం
పోర్టు ఫోలియో కృత్యం
కోవిడ్ పరిస్థితులలో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక
విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించడం, ఆన్ లైన్ తరగతుల నిర్వహణ పేద మధ్య తరగతి విద్యార్థులుకు అందక పోవడం, నెట్ సదుపాయాలు లేని గ్రామాలు వలన విద్యార్థులు పాఠశాలకు హాజరు పర్చడం అనుసంధానం చేయడం కోసం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనవి. ఇందు కోసం పాఠశాలలో సురక్షిత పరిసరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఏ ఒక్కరికీ వైరస్ సోకకుండా చూడవలసిన బాధ్యత అందరి వ్యక్తులు పై ఉంది.
పాఠశాల ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు:
పాఠశాల ప్రారంభానికి ముందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలో ఇతర వ్యక్తులు ఈ కింది అంశాలపై అవగాహన చేసుకోవాలి.
పాఠశాలలో సురక్షిత చర్యలు పై చర్చించి పనులు చేపట్టాలి. పాఠశాలను పరిశుభ్రత పరచడం, చేతులు శుభ్రత ఏర్పాటు, మాస్క్ ధరించి రావడం, ఆరు అడుగుల దూరం ఏర్పాటు చేయడం మొదలైన విధి విధానాలు రూపకల్పన చేయాలి.
పాఠశాలలో ఎవరైనా అనారోగ్య లక్షణాలు కనబడిన మరియు ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి అనారోగ్య లక్షణాలు కనబడిన వెంటనే దాచ కుండా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించడం.
అనారోగ్య లక్షణాలు కలిగిన ఉపాధ్యాయులు కు ప్రధానోపాధ్యాయులు శెలవు మంజూరు చేయడం.
పాఠశాలకు వచ్చే ముందు విద్యార్థి తీసుకోవలసిన రక్షణ చర్యలు పై తల్లిదండ్రులుకు అవగాహన కల్పించాలి.
అత్యవసర పరిస్థితి కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా అనుసంధానం ఉండేలా ఏర్పాటు చేయడం.
తల్లిదండ్రులు వారి వృత్తి పై, వారి కదలికలు పై దృష్టి సారించడం.
సామాజిక భౌతిక దూరం:
వ్యక్తి వ్యక్తి మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం ఉండే విధంగా పాఠశాల ఆవరణం ఏర్పాటు చేయాలి.
విద్యార్థులు పాఠశాలలో ఎక్కువగా ఉంటే సగం మంది విద్యార్థులు సరి తారీఖున మిగిలిన సగం మంది విద్యార్థులు బేసి తారీఖున హాజరు కావాలని చెప్పడం.
గ్రంథాలయం, కంప్యూటర్, ప్రయోగాలు నిర్వహణ సమయంలో భౌతిక దూరం పాటించాలని చెప్పడం. అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయడం.
క్రీడలు ద్వారా విద్యార్థి శారిరక, మానసిక ఉల్లాసం పెంపొందించడం.
విద్యార్థులుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి తల్లిదండ్రులు మరియు విద్యార్థులుకు తగిన సూచనలు చేయడం.
సొంత వాహనాలు ద్వారా విద్యార్థులు పాఠశాల చేయవలసిన ఆవశ్యకత తెలియపరచడం.
విద్యార్థికి పౌష్ఠిక ఆహారం అందించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచడం.
పాఠశాల విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. భౌతిక దూరం పాటింపచేయడం.
ఒత్తిడి రహిత అభ్యుసన వాతావరణం, స్నేహ పూర్వక బోదనభ్యసన పద్ధతులు పాటించడం. ప్రయోగాత్మక అభ్యసన పై దృష్టి ఉంచడం.
స్వీయ అభ్యసన ప్రేరేపించడం, అభ్యాస లక్ష్యాల సాధన, డిజిటల్ విద్య నిర్వహించడం.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితి అధిగమించి అభ్యసన ఆటంకం లేకుండా విద్యార్థి అభ్యసన పద్ధతులు, మూల్యాంకన పద్ధతులు పాటించి కోవిడ్ 19 పరిస్థితులు పాఠశాల విద్యలో School Education సవాళ్లను అధిగమించాలి.