Module -18 AP Understanding Rights The POCSO Act 2012
మాడ్యూలు 18
హక్కుల పై అవగాహన మరియు పోక్సో చట్టం 2012
పాఠశాలలో పిల్లల వేధింపుల నివారణకు మనము తీసుకోగల చర్యలు
హక్కును త్రోసిపుచ్చిన లేదా ఉల్లంఘించిన దాన్ని వేధింపు అంటారు. బాధితులు చిన్న వారు ఐతే అది పిల్లల పై వేధింపులుగా గుర్తించబడుతుంది. పిల్లలు పై వేధింపులు నిరంతరం జరిగిన లేదా ఒక సారి జరిగిన అది వేధింపులు గానే పరిగణనలోకి వస్తుంది. అది శరీరకంగానో లేదా భావోద్వేగంగానో వేధింపులు కావచ్చు లేదా నిర్లక్ష్యానికి గురి కావచ్చు. ఇంకా వేధింపులు శరీరకంగా లేదా ఆన్ లైన్ ద్వారా అయినా కావచ్చు. ఇవి అన్నీ పిల్లలు పై వేధింపులు కింద వస్తాయి.
శారీరక వేధింపులు:
పిల్లలను శారీరకంగా హాని కలిగించే చర్యలు చేయడం. ఉదాహరణకు పిల్లలను కొట్టడం, తన్నడం, గుద్దడం, రక్కడం, గొంతు పిసకడం మొదలైన చర్యలు వారి పై జరగకుండా జాగ్రత్త చర్యలు పాటించుట.
భావోద్వేగ వేధింపులు:
భావోద్వేగ వేధింపులు అనేవి భావోద్వేగానికి సంబంధించిన దుర్వినియోగం. శారీరక వేధింపులు కన్నా భావోద్వేగ వేధింపులు పిల్లలు పై బాగా ప్రభావితం చేస్తాయి. వైకల్యం ఉన్న పిల్లలను అపహాస్యం చేయడం, బెదిరింపు, పిల్లలు మీద ప్రతికూల వాక్యలు, తల్లిదండ్రుల వృత్తి మీద ప్రతికూల వాక్యలు చేయడం వంటి భావోద్వేగంతో కూడిన వాక్యలు చేయకూడదు.
నిర్లక్ష్యం:
నిర్లక్ష్యం అంటే పిల్లలు ప్రాథమిక అవసరాలు తీర్చడంలో వైపల్యం. అంటే పిల్లలు ఆహారం, ఆట, విద్య మొదలైన వారి అవసరాలను కూడా పట్టించుకోవాలి. లింగ వివక్షత కూడా నిర్లక్ష్యంకు ఒక రూపం.
గుర్తించుకోవలసిన విషయాలు:
ఇవి ఎప్పుడూ పిల్లలు తప్పు ఎంత మాత్రమూ కాదు. పిల్లలు వీటి గురించి కథలు అల్లరు. కొంత మంది పిల్లలకు ఇవి బహిర్గతంగా గాని భౌతికంగా గానీ ఎప్పుడూ కనిపించవు. కొన్ని వైద్య పరీక్షలు ద్వారా కూడా గుర్తించబడడం లేదు. చాలా మంది పిల్లలకు తెలిసిన వ్యక్తులు మరియు సన్నిహితులు నమ్మకంగా ఉండే వారు, భాధ్యత కలిగి ఉన్న వారు ద్వారా నే జరుగుతోంది. ఇది ఒక సార్వత్రిక సమస్య. బాలబాలికలు అందరూ ఈ ప్రమాదంలో చిక్కు కుంటున్నారు.
మన పిల్లలకు తమ శరీరాన్ని వేడి, చలి, అగ్ని, మరియు గాయాలు నుండి ఎలా రక్షించు కోవాలో నేర్పినట్లే వారికి స్వీయ రక్షణ చర్యలు నేర్పించాలి. జరిగిన వేధింపులు సమాజంలో తెలిసినప్పుడు వేధించిన వారి కంటే భాధితులు కోల్పోయినది ఎక్కువగా ఉంటుంది. ప్రజలు నుండి స్పందన లేకపోవడంతో వేధింపులు చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. వేధింపులు గురి చేసే వ్యక్తులు పేర్లు బహిరంగం చేసినపుడు అటువంటి పనులు జరగకుండా మిగిలిన వారు జాగ్రత్తలు పాటిస్తారు.
POCSO చట్టం, 2012 యొక్క ముఖ్య అంశాలు
POCSO Act 2012 :
పోక్సో చట్టం తటస్థంగా ఉంటుంది. బాలబాలికలు అందరికీ సమానంగా వర్తిస్తుంది.
ఇది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల అందరికి వర్తిస్తుంది.
పిల్లలకు సంరక్షణ కల్పన మరియు పునరావాసం కోసం శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరు పరచాలి.
చట్టం యొక్క నిబంధనలు గూర్చి ఉపాధ్యాయులు విద్యా సంస్థలు మరియు ఇతర ఉద్యోగులు తప్పకుండా తెలుసుకోవాలి.