Mid Day Meal in Schools MDM Menu Andhrapradesh India

Mid Day Meal in Schools MDM Menu Andhrapradesh India

MDM MENU

 

WEEK వారం MENU FOOD ITEM
సోమ హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు లేదా కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర,
చిక్కీ
మంగళ దొండకాయ చట్నీతో చింతపండు పులిహోర, ఉడికించిన కోడిగుడ్డు
బుధ కూరగాయల అన్నం,
బంగాళదుంపకుర్మా,
ఉడికించిన కోడిగుడ్డు,
చిక్కీ
గురు సాంబార్‌బాత్/నిమ్మకాయ రైస్, టమోటా చట్నీతో,
ఉడికించిన కోడిగుడ్డు
శుక్ర అన్నం,
ఆకుకూర పప్పు,
ఉడికించిన కోడిగుడ్డు,
చిక్కీ
శని ఆకుకూరతో అన్నం (పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు కాలానుగునంగా లభించేవి),
పప్పుచారు,
తీపిపొంగలి

 

WEEK FOOD ITEM
MON Hot Pongal with boiled egg /Veg. Pulav with Egg Curry
Chikki
TUES Tamarind Pulihora with Dondakaya chutney, Boiled Egg
WED Vegetable Rice
Aloo Khurma
Boiled Egg
Chikki
THU Sambarbath/Lemon Rice with Tomato chutney Boiled Egg
FRI Cooked Rice
Dal with green leaves
Boiled Egg
Chikki
SAT Green Leafy Veg. Rice (palakura, karivepaku, kothimera,Podina/seasonal green leafy), pappu charu, sweet pongal

 

MDM RATES

STAGE OLD COST Additional Cost TOTAL
Primary Rs. 5.45 Rs. 0.43 Rs. 5.88
UP/HS Rs. 8.17 Rs. 0.40 Rs. 8.57

Download Copy

MDM MENU NEW-2023

MENU PREPARATION

MDM CASH VOUCHER 1

MDM CASH VOUCHER 2

 

పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన గుడ్లు సరఫరా!

నెలకు 4 సార్లు గుడ్ల సరఫరా. పాఠశాలల్లో నిల్వ, కుళ్లిన గుడ్లు సరఫరా చేయడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నెలలో కనీసం నాలుగు సార్లు పాఠశాలలకు తాజా గుడ్లు సరఫరా చేయాలి. పాఠశాలల వారీగా వారంలో బుధవారం రోజున సరఫరా చేస్తారు. 

సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్దిష్ట వారానికి సరఫరా చేసిన గుడ్లను ఆ వారానికి ఉపయోగించాలి నిల్వ చేయకూడదు! వారంలో శుక్రవారం ఉపయోగించని గుడ్లు వంటకాన్ని తయారు చేయడం ద్వారా విద్యార్థులకు అందించాలి అనగా, Egg Dish, recipe viz.., Egg Burji మొదలైనవి, లేదంటే ఉపయోగించని గుడ్లను పాఠశాలలో Lower తరగతులు విద్యార్థులకు handover చేసి Acknowledgement ను రిజిస్టర్ లో నిర్వహించాలి.

ప్రతి గుడ్డుపై సరఫరా మరియు మార్కింగ్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:-

WEEK COLOUR
1st Pink
2nd Blue
3rd Green
4th Purple

4 Times Eggs Supply New

 

Training to CCHS

పాఠశాల విద్య జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం MDM సూచనలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మార్గదర్శకాలు.

ప్రతి రోజూ పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

పాఠశాల ప్రారంభం కాక ముందే వంట మనుషులు వారికి సాయం చేసేవారి యొక్క ఆరోగ్యం పై ధృవీకరణ తీసుకోవాలి.

వంట శాల మరియు తయారు చేసే ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వంట గ్యాస్ పై వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

వంట చేసే పాత్రలు, గదులు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.

భోజనాన్ని శుభ్రంగా ఉన్న ప్రదేశంలో తయారు చేయాలి. వంట చేసేవారు రింగులు, గాజులు ధరించకూడదు.

నైల్ పాలిష్ మరియు ఇతర గోళ్ళకు రంగులు వేయకూడదు.

వంట చేసేటప్పుడు మరియు వడ్డించే టప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతికి గడియారం, రింగులు, గాజులు మరియు బంగారం ధరించకూడదు.

మధ్యాహ్న భోజన కార్మికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల వండే టప్పుడు వడ్డించే టప్పుడు తలపై క్యాప్ తప్పనిసరిగా ధరించి ఉండాలి.

ఉమ్మి వేయడం, ముక్కును తడుము కోవడం నిషేదం.

మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రంగా ఉన్న వస్త్రాలు, ఆప్రాను ధరించాలి.

కూరగాయలను ఉప్పు – పసుపు లేదా 50 PPM క్లోరిన్ తో కడగాలి.

భోజనము 65° సెల్సియస్ కలిగి ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించ కూడదు.

ప్రధానోపాధ్యాయుడు మధ్యాహ్న భోజన వివరాలను జగనన్న గోరుముద్ద మరియు IMMS app నందు తప్పనిసరిగా రోజూ నమోదు చేయాలి.

మధ్యాహ్న భోజన మెనూ చార్ట్ ను పాఠశాల Notice Board నందు ప్రదర్శించాలి.

మధ్యాహ్న భోజన రోజు వారి నిర్వహణ రికార్డులు రోజూ అప్డేట్ చేస్తూ రికార్డులు అందుబాటులో ఉంచవలెను.

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు మాత్రమే కోడిగుడ్లు సరఫరా చేసే పంపిణీ దారులు నుంచి కోడిగుడ్లు తీసుకోవాలి. ఇతరుల ఎవరూ తీసుకోకూడదు.

ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు హాజరు, మధ్యాహ్న భోజనం తీసుకున్న వారి వివరాలు, కోడిగుడ్లు వినియోగం మొదలైన వాటి మొత్తం వివరాలు మధ్యాహ్న భోజనం అయిన తరువాత వెంటనే నమోదు చేయాలి.

Child info సమాచారం మరియు MDM గణాంకాల మధ్య తేడా ఉంటే Child info వెంటనే update చేయవలెను. వీటి మధ్య తేడా లేకుండా పిల్లలు సంఖ్య నమోదు చేయాలి.

ప్రధానోపాధ్యాయుడు ప్రతి రోజూ హాజరు వివరాలు App నందు తప్పనిసరిగా నమోదు చేయాలి.

 

 

 

Related posts

One Thought to “Mid Day Meal in Schools MDM Menu Andhrapradesh India”

  1. […] రాగి జావ మిడ్ డే మీల్ లో భాగంగా ప్రవేశ పెట్టినప్పటికి […]

Leave a Comment