Most Teachers Opinion Report Online Andhrapradesh
OLD POLLS
సర్వే:
ఈ సర్వే కేవలం ఉపాధ్యాయులకు సంబంధించినది. సర్వే పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయమే తెలియ పరుస్తుంది. ఇక్కడ జరిగిన సర్వే ఫలితాలు కేవలం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల నుంచి తీసుకొనబడింది.
ఫలితాలు విషయంలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫలితాలు అంత ప్రామాణిక మైనవి కావు.
అయినప్పటికీ స్పందించే ఉపాధ్యాయులు పాల్గొని వారి అభిప్రాయం వ్యక్తపర్చినది. విలువ కలిగినది.
ఎటువంటి వివాదాలు, చర్చలకు అవకాశం లేనిది. ఈ సర్వే అందరి ఉపాధ్యాయుల వ్యక్తిగత అభిప్రాయం మొత్తంలో తెలుసుకొనేది.
అభిప్రాయం:
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఇచ్చిన అంశం పై మీ అభిప్రాయం వ్యక్తపర్చగలరు. ఎక్కువ మందికి తెలియజేయగలరు.
ఇది మనలో కొందరు ఉపాధ్యాయులు వ్యక్తం చేసిన అభిప్రాయమే, అందరూ ఇక్కడ తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు.
ఈ సర్వే మీద పూర్తి అవగాహన మనకు మాత్రమే ఉంటుంది. అంశంపై ఉన్న అభిప్రాయమే సర్వే ఫలితం. ఏదైనా సమస్య మీద స్పందించే విషయంలో ఎటువంటి ఆలోచన చేయాలి.
ఇతరులు ఈ సమస్యను ఏ విధంగా తీసుకుంటారు, సమస్య మీద వారి అభిప్రాయం ఏమిటి? ఎంత వరకు ఈ సమస్య మీద స్పందించాలి మొదలైన అంశాలు అందరికీ తెలియ చేస్తోంది.
ఉపాధ్యాయులు:
తమ సమస్యలు కొందరు ఉపాధ్యాయులు స్వతంత్రంగా తెలియజేయలేరు. ఉద్యమాల కు దూరంగా ప్రశాంతంగా పాఠశాల నందు పిల్లలుకు విద్యను అభ్యసిస్తూ బయట ప్రపంచానికి దూరంలో ఉంటారు.
సమస్య మీద పోరాడే తత్వం, ప్రశ్నించే గుణం ఉన్నా వ్యక్తం చేయలేరు. కొందరు మహిళా ఉపాధ్యాయుల మరింత భిన్నంగా ఉంటారు. ఇటువంటి సమస్యలు పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది.
సాధారణంగా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వం మధ్య సంధాన కర్తలు.
అంతేకాకుండా మనకు అవసరమైన వృత్తి సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో నిరంతరం శ్రమించి కృషి చేస్తూ ఉంటారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేస్తూ తగిన విధంగా స్పందించి ఉపాధ్యాయ వర్గానికి మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు.
ఉపాధ్యాయ లోకంలో అనేక సంఘాలు కొత్తగా ఏర్పాటు చేయబడిన తరువాత కూడా సంఘాలు అన్ని ఏకమై అందరూ ఒక సమస్య కోసం సమ్మె చేయడం, సమస్యలు పరిష్కార మార్గాలను ప్రభుత్వంకు విన్నవించు కోవడం జరుగుతుంది.
ప్రభుత్వంతో చర్చలు జరపడం జరుగుతోంది. కొందరు ఉపాధ్యాయులు బోధన చేస్తూ కూడా సంఘాలకే పరిమితమైన వారు ఉన్నారు.
Report:
సర్వే ఒక కృత్యం మాత్రమే. తప్పనిసరి కానిది. పాల్గొన్న వారి అభిప్రాయం ఇతరులకు చూపించేది. ఆనందకరమైనది. విశ్లేషణ కూడినది. ఒక అంశం పై అందరి దృష్టి ఏ విధంగా ఉందో తెలియ పరుస్తూంది.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకత తెలియజేయదు. ఏదైనా ఒక ఉపాధ్యాయ సంఘానికి వ్యతిరేకత కూడి ఉన్నది కాదు. వ్యక్తులు, సంస్థలు పనితీరు మీద ప్రశ్నకు తావు లేకుండా ఉంటుంది.
ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చూ. ఎంత వరకు ఇతర ఉపాధ్యాయుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియ పరుస్తూంది.