CLEP TELUGU PORTFOLIO MODEL QUESTIONS 10

CLEP TELUGU PORTFOLIO MODEL QUESTIONS 10

పోర్ట్ ఫోలియో అంశాలు

ఇతివృత్తం ఆధారంగా పాఠ్యాంశాల ఎంపికలో గల ఉద్దేశాల పై సమీక్ష.

మూడవ తరగతి
తెలుగు తోట

1. పాఠం: తెలుగు తల్లి
ఇతివృత్తం: దేశభక్తి

మొదట సరళమైన గేయం ద్వారా పాఠం ప్రారంభం చేయడానికి, తెలుగుభాష గొప్ప తనం, తెలుగు జాతి పట్ల అభిమానం పెంపొందే విధంగా ఉంది. పిల్లలకు చిన్న తనం నుండే దేశభక్తిని పెంపొందే విధంగా పాఠం రూపకల్పన చేశారు. సోదరభావం పెంపొందింప చేయడం. నేటి పిల్లలు రేపటి ఫౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ ఇతివృత్తం ఎంతో ఉపకరిస్తుంది.

 

2. పాఠం: మర్యాద చేద్దాం
ఇతివృత్తం: హాస్యం

పిల్లల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా రూపకల్పన చేశారు. పిల్లలు హాస్యం ద్వారా ఆహ్లాదపరచడం. ఇటువంటి అభ్యాసం నందు పిల్లలు చురుకుగా పాల్గొంటారు. ఆనందకర జీవనం అలవర్చుకుంటారు.

 

3. పాఠం: నా బాల్యం
ఇతివృత్తం: కళలు

పిల్లలకు కళలు పరిచయం చేయడం.
ఆటలు పట్ల ఆసక్తి కలిగించడం. వస్తువులు తయారీ విధానాన్ని సొంతంగా నేర్చుకోవడానికి ఈ అంశం ఎంతో దోహదపడుతుంది.

 

4. పాఠం: పొడుపు విడుపు
ఇతివృత్తం: బాషాభిరుచి

సంభాషణ నైపుణ్యం అభివృద్ధి చేయడం.
పిల్లలకు బాషాభిరుచి కలిగించడం. పిల్లలకు పొడుపు కథలపై ఆశక్తి కలిగించడం. నాటకీకరణ అలవాటు చేయడం. రసానుభూతి కలిగించుట.

 

5. పాఠం: మంచి బాలుడు
ఇతివృత్తం: మానవతా విలువలు పెంపొందడం

పిల్లలు చిన్నతనంలోనే తోటివారి పట్ల ప్రేమ, దయ, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవాలనే తపన కలుగుతుంది. సాటి మనుషులను సహాయ పడే గుణం అలవడుతుంది. సమాజ నిర్మాణంలో భాగస్వామి చేయాలి.

 

6. పాఠం: మా వూరి ఏరు
ఇతివృత్తం: ప్రకృతి వర్ణన

ప్రకృతి వనరులను గుర్తించగలరు.
పిల్లలు పెరుగుతున్నప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిలో మార్పులు, ప్రకృతి వల్ల ఉపయోగాలు తెలుసుకుంటారు. ప్రకృతి పట్ల ప్రేమ పెంచుకుంటారు. భాషాభివృద్ధి, ఆనందానుభాతిని చెందుతారు.

 

7. పాఠం: తొలి పండుగ
ఇతివృత్తం: సంసృతి సంప్రదాయాలు

పాఠంతో పాటు మానవ సంబంధాలు సంసృతి సంప్రదాయాలు తెలుసుకొని భిన్న వర్గాల మధ్య జీవనం సాగించే విధానాన్ని అలవాటు చేసుకుంటారు. వివిధ సామర్థ్యాలు అలవాటు చేసుకుంటారు. పెద్దలను గౌరవించడం, సమాజంలో పరిస్థితులను అర్ధం చేసుకుని మనుగడ సాధిస్తారు.

3వ తరగతి విద్యార్ధుల స్వీయ రచన సామర్థ్యం కృత్యాలు మరియు ఈ మాసం పాట, ఈ మాసం కథ.

 

ఈ మాసపు పాట

పిల్లలు ఇష్టపడే ఒక భాషాప్రక్రియ పాట. పాఠ్యపుస్తకాలలో పిల్లలు పాడగలిగే దేశభక్తి గేయాలు, ప్రకృతి, లలిత గీతాలు పొందుపరచడం జరిగింది. ఇవి తెలుగు కవులు రాసినవి. ఉపాధ్యాయలు ఈ పాటలన్నింటినీ పిల్లలతో పాడించాలి.

అభ్యాసాల స్వభావం:

పాట/గేయం ప్రధానంగా దేశభక్తి , ప్రకృతి, లలితగీతంగా ఉంటాయి.

కొన్ని సందర్భాలలో అభినయం జోడించి పాడే విధంగా ఉంటాయి.

మరికొన్ని సందర్భాలలో హావభావాలు జోడించి పాడే విధంగా ఉంటాయి.

సంగీతపరంగా అనునయిస్తూ పాడే విధంగా ఉంటాయి.

తరగతి గదిలో ఎలా నిర్వహించాలి:

పిల్లలను “U” ఆకారంలో కూర్చోబెట్టాలి

పాటను ఒక నల్లబల్లపై నెల అంతా ఉండేలా ప్రదర్శించాలి

ఉపాధ్యాయుడు గేయాన్ని కనీసం 2 సార్లు పాడి వినిపించాలి

అవసరమైన చోట అభినయం, హావభావాలు జోడిస్తూ పాడి చూపాలి

ఆ గేయానికి సాంకేతికత అనగా సంగీతపరంగా, యూట్యూబ్ లో అభించే సంగీతం సహకారంతో పాడించాలి.

సమయం లభించినప్పుడు ఆయా నెలలోని ఆయా గేయాన్ని వినిపించుకొనే అవకాశంగా ఉంది

శనివారం సందడిలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి

 

ఈ మాసపు కథ

కథలు పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఒక తన్మయత్వానికి, అనుభూతికి గురిచేస్తాయి. తాము చూడని సన్నివేశాలు,సంఘటనలు కథల్లో ఎదురయినప్పుడు పిల్లలు వాటిని నిజజీవిత సన్నివేశాలతో పోల్చుకుంటారు. కథలను సొంత మాటలలో చెప్పేటప్పుడు తమకు తెలిసిన భాషలో, ఆ కథల్ని తిరిగి చెబుతారు. పిల్లలు పాఠకులుగా, భాషాభిమానులుగా మారడానికి కథలు ఎంతగానో దోహదపడతాయి.

అభ్యాసాల స్వభావం:

కథ పిల్లలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇవ్వాలి

తమ లోకానికి దగ్గరగా ఉండాలి

తిరిగి చెప్పేటందుకు వీలుగా కథనం ఉండాలి

తరగతి గదిలో ఎలా నిర్వహించాలి:

హావభావాలతో చెప్పాలి.

*కథ చెబుతున్న మధ్య లో ప్రశ్నలు అడగాలి.

ఆ కథ ఉత్తేజాన్ని కల్గేలా ఉండాలి.

కథ వారి సొంత మాటల్లో చెప్పించాలి.

 

CLEP TELUGU

 

CLEP TELUGU PORTFOLIO MODEL QUESTIONS 10

 

1. నూతన ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాలు ఏ పేరుతో మన ముందుకు వచ్చాయి?

తెలుగు తోట

2. పిల్లల సర్వతోముఖ వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళికను
తగ్గించాలి అనే సూచన చేసినది.

NEP 2020

3. పీరియడ్ పథకంలో
మొదటి 45 నిమిషాలలో చేయవలసినది.

పాఠ్యాంశ బోధన

4. బోధనా సోపానాలలో పాఠం చిత్రం గురించి మాట్లాడించిన తరువాత వచ్చే సోపానం ఏది?

పఠనం / చదవడం

5. 1, 2 తరగతులలో ఎన్ని భాషా సామర్థ్యాలను పరిచయం చేశారు?
4

6. గుణింతాలు నేర్పడం ఏ తరగతిలో వుంది?

2 వ తరగతి

7. సంసిద్ధతా పాఠాలు
సాధనలో కృత్యాలు

వ్యక్తిగత కృత్యాలు

8. ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాలలో లేఖ ప్రక్రియలో ఉన్న పాఠం ఏది?

కొండవాగు

9. పరస్పర ప్రతిచర్యలు ఏ మూల్యాంకనం కిందకు వస్తుంది?

అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం

10. సాంకేతికత సహాయంతో పాఠాలను వీక్షించే ప్లాట్ ఫాం.

DIKSHA

 

 

Please Share My Website

 

Related posts

Leave a Comment