Ragi Java
Government of Andhrapradesh School Education Department – Jagananna Gorumudda Scheme — Ragi Java
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – పాఠశాల విద్యా శాఖ – జగనన్న గోరుముద్ద పథకం – మిడ్ డే మీల్ మెను
జగనన్న గోరుముద్ద పథకం (మిడ్ డే మీల్) కింద విద్యార్థులందరికీ చిక్కీ లేని రోజులు అంటే వారానికి మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారాలలో ‘రాగిజావా’ అందించాలని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, పుట్టపర్తి, వారి సహకారంతో ఈ పథకం 21.03.2023 ప్రారంభించారు.
విద్యార్థులకు అదనపు పోషణ కోసం ‘రాగిజావా’ జోడించాలని ప్రభుత్వం ప్రతిపాదించబడింది. రాగుల పిండి మరియు బెల్లం పొడిని ఉచితంగా అందిస్తారు. ఈ పథకం పాఠశాలలో విద్యార్థుల డ్రాపౌట్స్ , పోషకాహార లోపం, రక్తహీనత లోపాన్ని పరిష్కరిస్తుంది.
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, పుట్టపర్తి, రాగి పిండిని, బెల్లం పొడి సరఫరా చేస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు 86 కోట్లు. పదార్థాల ఖర్చు శ్రీ సత్యసాయి సెంట్రల్ ద్వారా దాదాపు 42 కోట్ల, మిగతా ఖర్చులు 44 కోట్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుంది. ఐరన్, కాల్షియం సమృద్ధిగా లభించే రాగి, బెల్లం మిశ్రమ జావను పిల్లలకు అందిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.
పిల్లలకు మధ్యాహ్న భోజనం కార్మికుల ద్వారా రాగి జావా తయారీ, సరఫరా చేయబడుతుంది. అక్షయపాత్ర వారు మాత్రం నేరుగా MLS పాయింట్ నందు రాగి పౌడరు మరియు జాగ్రి లను తీసుకొని స్కూల్ పాయింట్ కు అందిస్తారు.
Ragi Java Preparation
Government of Andhrapradesh School Education Department – Jagananna Gorumudda Scheme
రాగి జావా పానీయం తయారీ
కావలసిన పదార్థాలు (ఒకరికి)
రాగి పిండి – 10 గ్రాములు
బెల్లం పొడి – 10 గ్రాములు
ఉప్పు – తగినంత
వేడి నీళ్లు – 150 మి.లీ.
10 గ్రాముల రాగుల పొడి మరియు 10 గ్రాముల బెల్లం పొడి యొక్క పదార్థాలతో 150 ml వేడి నీటితో వండాలి. రుచికరమైన రాగి జావ సిద్ధంగా ఉంది.
విద్యార్ధుల సంఖ్యకు తగ్గట్టు 5 కిలోల ప్యాకెట్లు మరియు 1 కిలోల ప్యాకెట్లు రూపంలో రాగి పొడి & బెల్లం పౌడరును విడివిడిగా పాఠశాలలకు సరఫరా చేస్తారు. FP షాపుల నుండి ప్రధానోపాధ్యాయుడు స్టాక్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం రాగి జావ మిడ్ డే మీల్ లో భాగంగా ప్రవేశ పెట్టినప్పటికి మధ్యాహ్నం భోజనంతో పాటు కాకుండా దీన్ని Breakfast రూపంలో విద్యార్థులకు అందిస్తారు. రాగి జావ నింపుటకు కావలసిన గ్లాస్ సరఫరా ప్రభుత్వమే భరిస్తుంది.
రాగిజావ సమయం:
ఫౌండేషన్ పాఠశాలలకు: ఉదయం 10.30-10.45
ఉన్నత పాఠశాలలకు: ఉదయం
10.40 -10.55
చిక్కి సమయం:
సాయంత్రం పాఠశాల పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులుకు అందజేయాలి.
Half-Day Schools timings
రాగి జావ మరియు చిక్కిని అందించే సమయం ఉదయం ఇంటర్నెల్
FS: 10.05 – 10.30
HS: 10.00 – 10.30
రాగి జావ ఇండెంట్ ను పాఠశాల రికార్డు నందు ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా నమోదు చేయాలి. స్టాక్ వివరాలు పొందపర్చాలి.
Download Copy
Half Day schools chikki timings